Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sammathame Movie Review : సమ్మతమే మూవీ రివ్యూ & రేటింగ్..!

Sammathame Movie Review : కిరణ్ అబ్బవరం.. ఈ పేరు వినగానే టక్కున గుర్తుచ్చే మూవీలు సెబాస్టియన్, ఎస్పీ కళ్యాణ మండంప, రాజా వారు రాణి వారు.. ఈ మూవీలతో కిరణ్ అబ్బవరం తనకంటూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ముందుకు వచ్చాడు. అదే.. సమ్మతమే.. జూన్ 24న థియేటర్లలో సందడి చేస్తోంది. ఒక ఫ్యామిలీ డ్రామాతో ముందుకు వచ్చిన సమ్మతమే మూవీకి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంటుందా లేదా తెలియాంలంటే రివ్యూ చదివి తెలుసుకోవాల్సిందే..

స్టోరీ ఇదే :
కిరణ్ అబ్బవరం (కృష్ణ) అనే రోల్ చేశాడు.. ఈ మూవీలో మిడిల్ క్లాస్ కుర్రాడిగా నటించాడు. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. అప్పటినుంచి ఇంట్లో ఆడవాళ్లు ఉంటేనే మంచిదనే భావనతో ఉంటాడు. సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేసుకుని అమ్మాయిని ఇల్లాలిగా తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు తనను చూస్తేనే చాలు.. అసహ్యించుకునే సాన్వి (చాందిని చౌదరి)ని కలుస్తాడు.

Sammathame Movie Review With Starring Kiran Abbavaram And Chandini Chowdary

అలా గొడవలతో మొదలైన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. కృష్ణ అతి ప్రేమని సాన్వి భరించలేకపోతుంది. మెల్లమెల్లగా కృష్ణపై శాన్వికి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. మళ్లీ గొడవలు ప్రారంభమవుతాయి. ఇలా గొడవలు పడుతూ సాగే వీరిద్దరి ప్రయాణంలో చివరికి కృష్ణ శాన్విని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే తప్పక మూవీ చూసి తీరాల్సిందే..

Advertisement

నటీనటులు :
కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. చిత్రానికి దర్శకత్వం గోపీనాథ్ రెడ్డి వహించగా.. ఛాయాగ్రహణం సతీష్ రెడ్డి మాసం అందించారు. సంగీతం శేఖర్ చంద్ర అందించారు.

Sammathame Movie Review : ఎలా ఉందంటే? :

సమ్మతమే నిజానికి అందరితో పూర్తి స్థాయిలో సమ్మతమే అనిపించేలా లేదనే చెప్పాలి. ఈ మూవీలో లవ్ స్టోరీ అన్ని స్టోరీల్లానే మామూలుగానే ఉందని సినిమా ప్రారంభంలోనే తెలిసిపోతుంది. ఫస్ట్ హాప్ లో కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రేమాణంతోనే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ చూస్తే.. అంతా ఎమోషనల్ తోనే సాగుతుంది. ఎమోషన్స్ డీలింగ్‌లో దర్శకుడు తడబడినట్టుగా అనిపించింది. స్టోరీలో ఏదో ఒక ప్రధాన అంశం మిస్ అయిందనే భావన కలగవచ్చు. క్లైమాక్స్‌ విషయంలో కిరణ్ అబ్బవరం చెప్పనట్టుగానే చక్కగా ఉంది. వైవాహిక, కుటుంబ సంబంధాల మధ్య ప్రత్యేకతను చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు. దర్శకుడు. కాకపోతే తన పాయింట్‌ను తెలియజేసే ప్రయత్నాల్లో స్టోరీని మరింత హైలెట్ చేసే సీన్లను జోడించి ఉంటే మరింత బాగుండేది అనిపించింది.

Sammathame Movie Review With Starring Kiran Abbavaram And Chandini Chowdary

కృష్ణ పాత్రలో కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించాడు. మిడిల్ క్లాస్ రోల్స్ తనకేం కొత్త కాదు. ఇక సాన్వి పాత్రలో చాందిని పర్వాలేదనిపించింది. ఈ మూవీలో చాందిని రోల్ కూడా అంత స్ట్రాంగ్ అనిపించలేదు. మిగిలిన రోల్స్ చేసిన నటులు తమ పాత్రకు తగినంతలో నటించి మెప్పించారు. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి పాయింట్ మంచిదే. అది ఆయన టేకింగ్‌లో బాగా కనిపించింది. ఇంకొంచెం ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. టెక్నికల్ సమ్మతమే పెద్దగా లేదు. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ పర్వాలేదు. శేఖర్ చంద్ర సంగీతం పర్వాలేదనిపించారు. ఫ్యామిలీ ఆడియోన్స్, రొమాంటిక్ మూవీలను ఇష్టపడేవారంతా సమ్మతమే మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Advertisement

రివ్యూ & రేటింగ్ : 3.5/5

Read Also : Chor Bazaar Movie Review : ‘చోర్ బజార్’ మూవీ రివ్యూ.. ఆకాష్ పూరీ మార్క్ చూపించాడు..!

Advertisement
Exit mobile version