Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Samantha : నేను ఇంకా చావలేదు.. బతికే ఉన్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. వీడియో వైరల్!

Samantha : స్టార్ హీరోయిన్ సమంత (Samantha)కు వచ్చిన వ్యాధి గురించి అనేక కథనాలు వస్తున్నాయి. సమంత ఆరోగ్య పరిస్థితిపై అనేక రకాలుగా రుమర్లు వినిపిస్తున్నాయి. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపించే వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన సమంత అనేక ఇబ్బందులు పడుతోంది. తన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంపై సమంత తీవ్ర ఆవేదనకు గురైంది. లేటెస్టుగా సమంతను యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్బంగా సామ్ యశోద మూవీకి సంబంధించి ఆసక్తకరమైన విషయాలను పంచుకుంది. అలాగే తన అనారోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా సమంత షేర్ చేసుకుంది.

Samantha turns emotional Words while talking about her health issues

ప్రస్తుతం సమంత లేటెస్ట్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత మీడియా ముందుకు రావడంతో ఆసక్తికరంగా మారింది. యశోదలో యాక్షన్ సీన్లు అద్భుతంగా వచ్చాయని తెలిపింది. క్లైమాక్స్‌లో యాక్షన్ ఎపిసోడ్ తనకు బాగా నచ్చిందన్నారు. థియేటర్‌లో చూస్తే చాలా బాగుంటుందని తెలిపింది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చిందని సమంత తెలిపింది. ఇక ఫైట్స్ విషయంలోనూ సమంత అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో సుమ సమంత ఆరోగ్యంపై అడిగిన ప్రశ్నకు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. సమంత ఫుల్ ఎమోషన్ అయిపోయింది.

Samantha : యశోద మూవీపై ఆసక్తికర విషయాలు చెప్పిన సామ్.. 

ఈ నేపథ్యంలో సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సమంత కన్నీళ్లు పెట్టుకుంది. ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. తన ఆరోగ్యంపై వస్తున్న రుమర్లపై సమంత చాలా సీరియస్ అయింది. ఒక్కసారిగా బోరుమని ఏడ్చేసింది సమంత. సమంత లేటెస్టుగా తన అనారోగ్యానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆ పోస్టులో ప్రతిఒక్కరి జీవితంలో కొన్నిరోజులు మంచి రోజులు.. మరికొన్ని రోజులు చెడు రోజులు ఉంటాయని చెప్పుకొచ్చింది.

Advertisement

ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని సమంత తెలిపింది. తన ఆరోగ్యంపై అతిగా స్పందిస్తూ తాను బతికి ఉండగానే చంపేస్తున్నారంటూ సమంత వాపోయింది. తాను ఇంకా చావలేదని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనని తెలిపింది. ఒక అడుగు ముందుకు వేస్తే.. అంతా అయిపోతుందని అనిపిస్తుందని అనేసింది.

Samantha turns emotional Words while talking about her health issues

ఈ కష్టమైన పరిస్థితుల్లో తాను ఎన్ని అడ్డంకులను దాటుకుని వచ్చానా? అని అనిపిస్తుందని సమంత బాగా ఎమోషనల్ అయింది. మయోసైటిస్ వ్యాధి బారిన పడినవారు చాలా మంది ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పింది. ఈ వ్యాధిని తాను కూడా ధైర్యంగా ఎదుర్కొంటానని సమంత చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూలో సుమ అడిగిన ప్రశ్నలకు సమంత తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంది.

అతి త్వరలోనే ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడతానని సమంత తెలిపింది. మరోవైపు.. సమంత లేటెస్ట్ మూవీ యశోద రిలీజ్ కు రెడీగా ఉంది. సరోగసి నేపథ్యంలో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా యశోద తెరకెక్కింది. ఈ మూవీ నవంబర్ 11వ తేదీన రిలీజ్ కానుంది. ఒకవైపు తన ఆరోగ్యం సహకరించికపోయినా సినిమా ప్రమోషన్లలో పాల్గొంది.

Advertisement

Read Also : Naga Chaitanya : సమంతకు వచ్చిన వ్యాధిపై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఫస్ట్ టైం చైతూ చేసిన పని ఇదే..!

Exit mobile version