Samantha : సమంత సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా? ఇన్నాళ్లకు సమంత ఆ విషయాన్ని రివీల్ చేసింది. తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఒక హోటల్లో పనిచేసేదట.. అక్కడ తనకు మొదటి జీతం రూ.500 తీసుకుందట.. ఏమాయ చేసావే మూవీతో తెలుగు మూవీ ప్రేక్షుకులకు దగ్గరైన సమంత.. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అందం, అభినయంతో పాటు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించింది.
తెలుగు, తమిళ్, కన్నాడ, హిందీ దాదాపు పలు భాషల్లో సమంత తన నటనతో అందరిని మెప్పించింది. అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. స్టార్ హీరోలతో అనేక సూపర్ హిట్ మూవీల్లో నటించింది సమంత. హిందీలలోనూ వరుస ఆఫర్లతో సామ్ దూసుకుపోతుంది. తెలుగులో యశోద, ఖుషి మూవీల్లో సమంత నటిస్తుంది. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సమంత రెడీ అవుతున్నట్టు తెలిసింది. సమంత సోషల్ మీడియలో ఏది పోస్టు చేసిన వెంటనే ట్రెండ్ అవుతుంది.
ఆమె తన సినీ విశేషాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా సామ్ పంచుకుంటుంది. సామ్ ఫ్యామిలీకి సంబంధించి తెలుసుకునేందుకు ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సమంత తన అభిమానులతో కూడా చిట్ చాట్ చేస్తుంటుంది. ఈ సందర్భంగా ఒక నెటిజన్ సామ్ ను ఒక ప్రశ్న వేశారు. తన ఫస్ట్ జాబ్.. జీతం ఎంతో సామ్ రివీల్ చేసింది. తాను సినిమాల్లోకి రాకముందు ఒక హోటల్లో హోస్టెస్ గా చేశానని, అప్పుడు 8 గంటల పాటు డ్యూటీ చేసి.. రూ.500 జీతాన్ని సంపాదించినట్టు తెలిపింది.
Her first income was Rs . 500 at 10 th std @Samanthaprabhu2 comes long way ❤️❤️ #SamanthaRuthPrabhu pic.twitter.com/2bBp2fLT8J
— Dhanam 🌹 (@dhanam_arjuner) April 21, 2022
అప్పుడు తాను పదో తరగతో 11వ తరగతి చదువుతున్నానని సామ్ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో కేవలం రూ.500 సంపాదించిన సమంత.. ఇప్పుడు కోట్లల్లో సంపాదిస్తోంది సామ్.. ఒక్కో మూవీకి రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు తీసుకుంటోంది. సమంత రస్సో బ్రదర్స్, సిటాడెల్ మూవీలతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
Read Also : Samantha: సమంత విషయంలోనే ఎందుకిలా జరుగుతోంది… నాస్టీ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?
