Samantha: టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంతలు విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ జంట విడిపోయి దాదాపుగా ఆరు నెలలు అవుతున్న కూడా ఈ జంటకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అంతేకాకుండా విడాకులు తీసుకొని ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ జంట విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఏమిటి అనే విషయంపై స్పందించలేదు. విడాకులు తీసుకున్న తరువాత స్నేహితులుగానే ఉంటాము అని ప్రకటించినప్పటికీ ఆ విషయాన్ని మరిచి ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా వారి వారి కెరీర్ లో బిజీగా మారిపోయారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సమంత అఖిల్ పై ఉన్న అభిమానంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పటికీ అఖిల్ మాత్రం ఆ పోస్ట్ పై స్పందించలేదు. ఇకపోతే తీసుకున్న తర్వాత నాగచైతన్య, సమంతలు కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సమంత ప్రస్తుతం చేతిలో అరడజనకూడా పైగా సినిమాలతో బిజీ బిజీ గా వుంది. నాగ చైతన్య కూడా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు. అంతే కాకుండా సమంత విడాకులు తీసుకున్న తరువాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తూ నిత్యం ఏదో ఒక రకమైన కొటేషన్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.