Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మార్చి 25 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇలా ఈ సినిమా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాలలో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమా ఎంతో విజయవంతం కావడంతో రామ్ చరణ్ చిత్ర బృందానికి సర్ప్రైజ్ ఇచ్చారు.
నేడు ఈ సినిమా ఇంత అద్భుతమైన విజయాన్ని అందుకుంది అంటే ఆ విజయం వెనుక హీరోలు మాత్రమే కాకుండా ఎంతో మంది టెక్నీషియన్లు ఉన్నారని వారి కష్టాన్ని గుర్తించిన రామ్ చరణ్ వారికి తనవంతుగా చిన్న కానుక బహుకరించారు. ఇలా రామ్ చరణ్ ఇంటికి ఆహ్వానించి ఊహించని విధంగా సర్ప్రైజ్ ఇవ్వడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది రామ్ చరణ్ అభిమానులు తన మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.