Puspha Movie: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలోని పాటలు డైలాగులు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు పుష్ప సినిమాలోని తగ్గేదెలే అనే డైలాగ్ సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా బాగా ఫేమస్ అయింది. ఇక ఈ సినిమాకు ఉత్తరాది రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి.
ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థి ఆన్సర్ పేపర్ లో సమాధానాలకు బదులు పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’ డైలాగ్‌ను పోలుస్తూ.. ‘పుష్ప, పుష్ప రాజ్.. పరీక్ష రాసేదేలే’ అంటూ రాశారు. ఇది చూసిన ఉపాధ్యాయుడు ఒక్కసారిగా ఖంగు తిన్నాడు.ఈ క్రమంలోనే ఈ ఆన్సర్ పేపర్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. దీన్ని బట్టి చూస్తే పుష్ప క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతోంది.
- RGV Comments : ఆర్జీవీ మరో సంచలనం.. అల్లు అర్జున్ సూపర్.. రజినీ, చిరు, మహేశ్ బాబు అందరూ వేస్టేనట..!
- Pushpa Srivalli Dance : తగ్గేదేలే.. బామ్మతో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును ఇరగదీశారుగా..!
- Pushpa Official Trailer : ‘పుష్ప’ ట్రైలర్ వచ్చిందిగా.. తగ్గేదే లే… కేక పుట్టిస్తోంది!
