Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Hari Hara Veera Mallu : ‘హరి హర వీర మల్లు’ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ డే 1.. తొలి రోజు ఎన్ని కోట్లు వసూళ్లంటే?

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ మూవీ ‘హరి హర వీర మల్లు – పార్ట్ 1 స్వోర్డ్ vs స్పిరిట్’ ఎట్టకేలకు (Hari Hara Veera Mallu) థియేటర్లలోకి వచ్చింది. అందరూ ఊహించినట్లుగానే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది.

ఎన్నో నిర్మాణ అడ్డంకులు ఉన్నప్పటికీ ఈ మూవీకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కలెక్షన్లు వచ్చాయి. ముందస్తు అంచనాల ప్రకారం.. ఈ మూవీలో అన్ని భాషలలో కలిపి మొదటి రోజు (గురువారం) రూ. 31.50 కోట్లు వసూలు చేసింది. ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్లలో రూ. 12.7 కోట్లు వసూలు చేసింది. దాంతో మొత్తం కలెక్షన్ రూ. 44.20 కోట్లకు చేరుకుంది.

నివేదిక ప్రకారం.. తెలుగు వెర్షన్ విడుదల రోజున సగటున 57.39శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. హైదరాబాద్ (66.75 శాతం), విజయవాడ (77శాతం) వంటి ప్రాంతాల్లో రోజంతా థియేటర్ల వద్ద జనంతో కిటకిటలాడాయి.

Advertisement

Read Also : Realme 15 Pro 5G : రియల్‌మి కొత్త 5G ఫోన్ అదుర్స్.. ఏఐ ఫీచర్ల కోసమైన కొనేసుకోండి.. ధర కూడా చాలా తక్కువే..

తెలుగు ప్రాంతాలలో చాలా వరకు ఉదయం షోలు పాజిటివ్ టాక్ అందుకున్నాయి. సాయంత్రం, నైట్ షోలలో కలెక్షన్ల సంఖ్య మరింత పెరిగింది. హిందీ ఆక్యుపెన్సీ 12.43శాతం వద్ద ఉండగా, కన్నడ, తమిళ వెర్షన్లు వరుసగా 9.96 శాతం, 8.24 శాతం వద్ద వెనుకబడి ఉన్నాయి.

Hari Hara Veera Mallu : వారాంతం ఇదే జోరు కొనసాగుతుందా? :

‘హరి హర వీర మల్లు’ మూవీ అనేది పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి ట్రీట్.. పవన్ యాక్షన్ గ్రాండ్ పీరియాడికల్ డ్రామాల పట్ల ఆసక్తి ఉన్నవారిని ఆకర్షించవచ్చు. చాలా మంది ప్రేక్షకులకు ఆకట్టుకోలేకపోవచ్చు. పార్ట్ 1లో పవన్ కళ్యాణ్ చరిష్మా, ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ ఒకటై అద్భుతంగా ఉంది. స్టోరీ, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొంచెం తడబడినట్టు కనిపిస్తోంది.

Advertisement

దాదాపు 3 గంటల నిడివితో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ‘హరి హర వీర మల్లు’ తొలి వారంలోనే మించి హిట్ టాక్ అందుకుంది. ఈ మూవీలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కూడా కీలక పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు బాగానే ఉన్నప్పటికీ మిశ్రమ స్పందన కారణంగా రాబోయే రోజుల్లో సినిమా కలెక్షన్ల జోరు అలానే కొనసాగుతుందా? లేదో చూడాలి.

Exit mobile version