Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

National Film Awards : జాతీయ అవార్డుల్లో సత్తా చూపిన సినిమాలు.. బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డు.. కలర్ ఫొటో..!

National Film Awards : కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులలో మన తెలుగు సినిమాల్లో సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రం గా కలర్ ఫోటో సినిమా ఎంపిక అయింది. ఉత్తమ కొరియోగ్రఫీ మేకప్ విభాగాల్లో నాట్యం సినిమా ఎంపికయింది. ఇక ఉత్తమ సంగీత చిత్రంగా అలా వైకుంఠపురం సినిమా అవార్డును దక్కించుకుంది.

national-film-awards-telugu-films-colour-photo

ఇక ఉత్తమ నటుడిగా ఇద్దరు హీరోలకి అవార్డులు వరించాయి. సురారైపోట్రు తెలుగు లో (ఆకాశం నీ హద్దురా) సినిమాకు గాను హీరో సూర్య కి అలాగే తానాజీ లో నటనకు గాను అజయ్ దేవ్ గన్ కి అవార్డులు వరించాయి. ఉత్తమ నటిగా సురారైపోట్రు మూవీలో నటించినందుకు గాను హీరోయిన్ అపర్ణ బాలమురళిని అవార్డు వరించింది.

ఇక ఈ ఏడాది మొత్తం ముప్పై భాషల్లో 305 ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ కి వచ్చాయి. అలాగే నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 20 భాషల్లో స్క్రీనింగ్ వచ్చినట్లు జ్యూరీ మెంబర్స్ తెలిపారు. ఈ ఏడాది అవార్డులను ఐదు క్యాటగిరిలు గా విభజించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్ 28 కేటగిరీలు, నాన్ ఫీచర్ ఫిల్మ్ 22 కేటగిరీలు, బెస్ట్ రైటింగ్ సెక్షన్ మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ కేటగిరీలో అవార్డులు ప్రకటించారు.

Advertisement
national-film-awards-telugu-films-colour-photo

జాతీయ అవార్డుల విజేతలు వీరే:

ఉత్తమ చిత్రం: ( సూరారై పోట్రు)
ఉత్తమ నటి : అపర్ణ బాలమురళి( సురరై పోట్రు)
ఉత్తమ నటుడు : సూర్య( సూరరై పోట్రు)
ఉత్తమ దర్శకుడు: సచ్చిదానంద( అయ్యప్ప కోసియం)
ఉత్తమ సహాయనటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి( శివ రంజనియం)
ఉత్తమ సహాయనటుడు: బిజూ మేనన్( అయ్యప్పను కోసీఎం)

Read Also : Horoscope : ఈ రెండు రాశుల వాళ్లు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే గొడవలే!

Advertisement
Exit mobile version