Actor Naresh:.గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ గత కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై నరేష్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన భార్య రమ్యతో తనకు గొడవలు ఉన్నాయని వెల్లడించారు. ఇకపోతే తన భార్య రమ్య ఎప్పుడు కూడా తనతో ఒక భార్యగా బిహేవ్ చేయలేదని తెలిపారు.
ఇకపోతే పవిత్ర లోకేష్ గురించి మాట్లాడుతూ పలు సినిమాలలో నటించడం వల్ల చాలామంది మా గురించి ఇలా మాట్లాడుతున్నారు నిజానికి ఆమె ఒక మంచి స్నేహితురాలని నరేష్ తెలిపారు. నాకు ఎంతోమంది స్నేహితుల ఆత్మీయులు ఉన్నారు. అలాంటి వారిలో పవిత్ర ఒకరు.ఇక ఆమె టెస్టింగ్ ఆపరేషన్ చేసిన విషయంపై స్పందిస్తూ సమాజానికి ఉపయోగపడే విషయాలపై స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిన మీడియా వ్యక్తిగత విషయాల గురించి స్టింగ్ ఆపరేషన్ చేయడం బాధాకరం అని తెలిపారు.తను మానసికంగా కృంగిపోయినప్పుడు పవిత్ర తనకు ఎంతో అండగా నిలిచిందని అలాంటి ఆత్మీయురాలు ప్రతి ఒక్కరికి ఉండాలని తెలిపారు. మొత్తానికి నరేష్ తన భార్య గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
