Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Manchu Lakshmi: ఈ సినిమాతో నా కల నెరవేరబోతోంది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మంచు లక్ష్మి?

Manchu Lakshmi: మంచు లక్ష్మి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి మోహన్ బాబు వారసురాలిగా పరిచయమయ్యారు. అయితే ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే పలు సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమాలతో పాటు మంచు లక్ష్మి ఎన్నో టీవీ షోలను కూడా నిర్వహించారు.ఇలా నటిగా నిర్మాతగా వ్యాఖ్యాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు లక్ష్మి తాజాగా తను నటిస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు.

ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అగ్ని నక్షత్రం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సినిమాకి ఈమె నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఈ సినిమాలో మంచు లక్ష్మి తో పాటు ఆమె తండ్రి మోహన్ బాబు కూడా నటిస్తున్నారు. అయితే ఇప్పటివరకు మంచు లక్ష్మి మోహన్ బాబుతో కలిసి ఒక సినిమాలో కూడా నటించలేదు.

ఇలా తండ్రి కూతుర్లు ఇద్దరు మొదటిసారిగా స్క్రీన్ పంచుకోవడంతో మంచు లక్ష్మి ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ ఇన్ని రోజులకు నా కల నెరవేరబోతోంది..నాన్నతో కలిసి నటించడమే కాకుండా ఆయనతో పాటు నిర్మాణంలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
Exit mobile version