R.K Roja: బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమానికి జడ్జిగా వ్యవహరించిన రోజా మంత్రి అయిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.ఈ క్రమంలోనే మంత్రిగా అదనపు బాధ్యతలు రావడంతో ఇక పై వెండితెరపై బుల్లి తెరపై సందడి చేయలేనని ఈమె ప్రకటించారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ టీమ్ ఈమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో భాగంగా జబర్దస్త్ వేదికపై రోజాకు ఘనంగా సన్మానం చేసి మల్లెమాల వారు, జబర్దస్త్ కమెడియన్స్ తనకు సన్మానం చేశారు.
నిజానికి ఈ ప్రోమో కొత్త ఎపిసోడ్ కి సంబంధించినది అయినప్పటికీ, ఈ ఎపిసోడ్ ముందుగానే షూట్ చేసి ఉంటారని తెలుస్తోంది. ఈ విధంగా మంత్రిగా రోజా ప్రమోట్ అయిన తర్వాత ఈ ఎపిసోడ్ ప్రసారం కావడంతో ఈ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పటిలాగే రోజా ఈ ప్రోమోలో కూడా కంటెస్టెంట్ లపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ అందరిని సందడి చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.