Chiranjeevi: నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో ఎదురుచూసిన ఆర్ఆర్ఆర్ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలోనే సాధారణ అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లి ఈ సినిమాని చూస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ కుటుంబం మెగా కుటుంబం ఈ సినిమాని వీక్షించారు. ఈ క్రమంలోనే మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఆర్ఆర్ఆర్ టీమ్ బెనిఫిట్ షోలను చూసింది. ఈ సినిమా చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాపై స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవితో పాటు తన కూతురు తన భార్య మనవరాళ్లతో సహా ఈ సినిమాని చూశారు.ఇక చిరంజీవి కూతురు సుస్మిత ఈ సినిమాపై స్పందిస్తూ ఈ సినిమా చూస్తున్నంత సేపు సంతోషంతో కడుపు నిండిపోయిందని తెలిపారు. అలాగే ఈ సినిమా అయిపోయే వరకు ఎన్టీఆర్ చరణ్ ఇద్దరు సొంత అన్నదమ్ములు అన్న భావన కలిగిందని సుస్మిత వెల్లడించారు.సినిమా క్లైమాక్స్ లో ఇద్దరూ కలిసి రావడం అద్భుతమైన సీన్ అనిపించింది. నాకు ఆ సీన్ చాలా బాగా నచ్చిందని సుస్మిత ఈ సినిమాపై స్పందించారు.
