Upasana: టాలీవుడ్ యంగ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రీ అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలో చరణ్ నటనకు గాను సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లో కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే రామ్ చరణ్ హీరోగా అభిమానులను సినిమాల ద్వారా అలరిస్తూనే మరొకవైపు తనలో ఉన్న సేవా గుణాన్ని కూడా చాటుతూ ఉంటాడు. నిత్యం సామాజిక సేవ చేయాలి అని పరితపిస్తూ ఉంటాడు.
2022 ఏడాదికి గాను ఉపాసన ఆ పురస్కారాన్ని అందుకోబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. గొప్ప కార్యక్రమం లో మమ్మల్ని భాగం చేసిన మా తాతయ్య అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి కే ఈ అవార్డు ఘనత దక్కుతుంది అని తెలిపింది. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి లో భాగంగా వైద్య సేవలను మెరుగుపరచాలి అనేది ఆయన లక్ష్యం అని అదే నాకు స్పూర్తిని ఇచ్చింది అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. ఒకవైపు రామ్ చరణ్ సినిమాల ద్వారా ఇంత మంది అభిమానుల మనసులలో స్థానం సంపాదించుకుంటే, మరొకవైపు ఉపాసన సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మంది గ్రామీణ ప్రజల ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంటోంది. వీరిద్దరూ కూడా సేవా కార్యక్రమాల్లో భాగంగా ముందు ఉంటారు.