G
Telugu News » Entertainment » mega daughter niharika konidela shocking comments on young anchor akhil
⚡ Entertainment, Latest, Trending

Niharika Konidela : ‘రేయ్.. నువ్వు పసికందు కాదురా.. కసికందు’ అంటూ నిహారిక సంచలన కామెంట్స్!

Niharika Konidela, Anchor Akhil, Anchor Suma Cash Promo, Helloworld Web Series, నిహారిక కొణిదెల సంచలన కామెంట్స్, పసికందు కాదురా కసికందు, యాంకర్ సుమ, telugu news

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Niharika Konidela : నిహారిక కొణిదెల ఈ పేరు కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు అటు బుల్లితెర లోనూ ఇటు వెండితెర లోనూ సందడి చేస్తుంది.. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిజానికి మెగా ఫ్యామిలీ నుండి పరిచయం అయినప్పటికీ.. తనకున్న అద్భుతమైన టాలెంట్ లతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లు అందుకుంది.

Mega Daughter Niharika Konidela Shocking Comments on Young Anchor Akhil

ఒక మనసు సినిమాతో ప్రారంభించిన నిహారిక.. తర్వాత ఆమె సూర్యకాంతం సినిమాలో కూడా నటించింది..నిహారిక కొన్ని వెబ్ సిరీస్ లోనూ నటించింది కానీ అవేవి ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో నటన పరంగా వెనకడుగేసి నిర్మాతగా సత్తా చాటాలని ప్లాన్ చేస్తుంది నిహారిక. ఈ క్రమంలోనే ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ అనే బ్యానర్ ను స్థాపించింది.. తన సొంత బ్యానర్ లోనే ‘ముద్దు పప్పు ఆవకాయ్’, ‘నాన్నకూచి’ అని వెబ్ సిరీస్ లను నిర్మించి, నటించింది.

Advertisement

Niharika Konidela : హలో వరల్డ్ వెబ్ సిరీస్.. క్యాష్ షోలో నిహారిక సందడి..

Mega Daughter Niharika Konidela Shocking Comments on Young Anchor Akhil

ఈ క్రమంలోనే హలో వరల్డ్ (Helloworld web series) వెబ్ సిరీస్ ను రూపొందించింది నిహారిక కొణిదెల. త్వరలోనే జీ5లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నటీనటులతో కలిసి క్యాష్ షో కి వచ్చింది. నిహారిక.. ఈ వేదికపై తెగ సందడి చేసింది. ఇందులో భాగంగానే వచ్చే శనివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కోసం ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ టీం సభ్యులు నిహారిక, నిఖిల్, నిత్య శెట్టి, అనిల్ గీలాలు ఎంట్రీ ఇచ్చారు. సుమా వీళ్ళతో తెగ సందడి చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

Read Also : Sreeja Third Marriage : షాకింగ్ ట్విస్ట్.. శ్రావణంలో శ్రీజ మూడో పెళ్లి.. చిరంజీవిని ఒప్పించింది ఆయనే..?!

క్యాష్ షో లో భాగంగా యాంకర్ సుమ.. నిఖిల్ కి మదర్ గా నటించింది. అప్పుడు నిహారిక వచ్చి ‘ఆంటీ.. నిఖిల్ కి ఎవరు నచ్చారంట’ అంటుంది. అప్పుడు సుమా ఊరుకో అమ్మ వాడు చిన్నపిల్లాడు అని సెటైర్ వేస్తుంది. అప్పుడు నిహారిక ‘సుమ నీ మమ్ నిహారిక ‘సుమ నీ మమ్మీ క్యారెక్టర్ నీ కాపీ చేసేసిందిరా’ అంటూ కామెంట్ చేసింది.

దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుతారు. నిహారిక తన గురించి చెప్పిన తర్వాత నిఖిల్ సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. అప్పుడతను అమ్మ.. నేను ‘ఏమీ ఎరుగని పసికందును’ అమ్మా అంటాడు. దీనికి వెంటనే నిహారిక’ నువ్వు పసికందు కాదురా.. కసికందువి’ అంటూ కామెంట్ చేస్తుంది. దీంతో నిఖిల్ షాక్ అయ్యాడు. మిగిలిన వాళ్ళు అవాక్కవుతారు. ఈ ప్రోమో తెగ వైరల్ అయిపోయింది.

Read Also : 

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Anchor AkhilAnchor SumaHelloworld Web SeriesNiharika KonidelaSuma Cash Promo
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు