Mahesh babu son goutham : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. మేహష్ బాబు ఒక రీజనల్ సినిమాతో 200 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. సక్సెస్ తర్వాత తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లాడు. మహేష్ షూటింగ్ లేకపోతే ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్స్ వేస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ సారి ట్రిప్ జర్మనీకి వెళ్లాడు. తాజాగా మహేష్ బాబు, నమ్రతలు ఇద్దరూ తమ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు. మహేష్ తనయుడు గౌతమ్ సీబీఎస్ఈలో మంచి మార్కులతో పదో తరగతి పాసయ్యాడు.
ఇందుకు మహేష్ బాబు ఓ రెస్టారెంట్ లో ఫ్యామిలీతో కలిసి ఉన్న ఒక ఫొటోని షేర్ చేసి గౌతమ్ పదో తరగతిలో పాసయ్యాడు. తనని చూస్తే గౌరవంగా ఉందంటూ పోస్టులో తెలిపాడు. అందుకే ఈ పార్టీ అని పోస్టు చేశాడు. ప్రస్తుతం జర్మనీలో ఉండటంతో అక్కడే ఓ ఫేమస్ రెస్టారెంట్ లో గౌతమ్ పదో తలగతి పాసైన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
ఇక నమ్రత కూడా గౌతమ్ ఫొటోను షేర్ చేసి నా కొడుకు పెద్దవాడయ్యాడు… పదో తరగతి పాసయ్యాు.. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు.. తనని చూసి గర్వపడుతున్నాను.. తన జీవితంలో ఇప్పుడు మరో అధ్యాయం మొదలవ్వనుంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇక మహేష్ బాబు అభిమానులు గౌతమ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.