Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sarkaru Vari Pata Trailer : సర్కారు వారి పాట ట్రైలర్ వచ్చేసింది.. మహేష్ ఫ్యాన్స్‌కు పండగే!

Sarkaru Vari Pata Trailer : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ పరసురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకంపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల అయిన ఈ సినిమా ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు అభిమానులను తెగ అలరించాయి. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

Sarkaru Vari Pata Trailer

చిత్రబృందం ఆదివారం చెప్పినట్లుగానే ట్రైల్ ను 105 షాట్స్ తో మేకర్స్ రిలీజ్ చేశారు. బ్యాంకింగ్ స్కామ్ ల నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కిన‌ట్లు ట్రైలర్​ చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్​ బాణీలు సమకూరుస్తున్నారు. హీరోయిన్​గా నటించిన కీర్తి సురేశ్​ కూడా తాజాగా డబ్బింగ్‌ పూర్తి చేసింది. దర్శకుడు పరుశురాం, మ్యూజిక్ డైరెక్టర్ తమన్​ దగ్గరుండి కీర్తి సురేశ్​తో డైలాగ్స్ చెప్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసిన కీర్తి.. ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది.

అయితే నేను విన్నాను… నేను ఉన్నానంటూ మహేశ్ బాబు కీర్తి సురేష్ తో చెప్పిన డైలాగ్ బాగా పేలింది.  ఈ డైలాగ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఎన్నికల ప్రచారంలో ఎన్నో సార్లు విన్న తెలుగు ప్రజలు ఇలా మహేష్ నోట వినడంతో ఆశ్చర్యపోతున్నారు. మహేష్ చెప్పిన ఈ డైలాగ్ తోనే ట్రైలర్ అదిరిపోయింది. పొలిటికల్ డైలాగ్ కి లవ్ ఎఫెక్ట్ ఇచ్చిన పరుశురాం మహేష్ నోట ఈ డైలాగ్ చెప్పించడం ట్రైలర్ కి హైలెట్ గా మారింది. ఇక సినిమాలో ఈ డైలాగ్, ఈ సీన్ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

Read Also : Mahesh babu fans : మిల్క్ బాయ్ ఫ్యాన్స్ హంగామా.. థియేటర్ అద్దాలు ధ్వంసం!

Exit mobile version