Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Kota Srinivasa Rao : బాబుమోహన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ‘కోట శ్రీనివాస్ రావు’.. ఆ రోజు వాడు అలా చేయకపోతే నన్ను ఎంతోమంది తిట్టుకునేవారు..!

Kota Srinivasa Rao praises Babu Mohan

Kota Srinivasa Rao praises Babu Mohan

Kota Srinivasa Rao : వెండితెరపై ఎంతోమంది కమెడియన్స్ నవ్వుల పువ్వులు పూయింస్తుంటారు. ఆనాడు రేలంగి, రాజబాబు నుంచి నేడు బ్రహ్మానందం, వెన్నెకిషోర్ వరకు ఆడియెన్స్‌ను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూనే ఉన్నారు. అయితే, కొందరు కమెడియన్స్ నటించిన ఫన్నీ సీన్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. వాటిని ఇప్పుడు చూసిన నవ్వు ఆపుకోలేకుండా ఉండలేమంటే అతిశయోక్తి కాదు.

కామెడీ ప్రపంచంలో ఆ సన్నివేశాలు ఎవర్ గ్రీన్‌లా నిలిపోతాయి. ‘మామగారు’ సినిమాలో బాబుమోహన్, కోట శ్రీనివాసరావు చేసిన కామెడీ కూడా ఈ కోవలోకి వస్తుంది. బిక్షగాడి వేశంలో బాబుమోహన్, అత్తింట్లో సెటిల్ అయిన అల్లుడి క్యారెక్టర్‌లో వీరిద్దరూ ఆ పాత్రలకు న్యాయం చేశారు. మూవీ మధ్యమధ్యలో వచ్చే వీరిద్దరి కామెడీ ఆ చిత్రానికే హైలెట్‌గా నిలుస్తుంది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంలోనూ వీరిద్దరి కృషి ఉందని చెప్పవచ్చు.

ఇటీవల కోట శ్రీనివాస రావు ‘ఆలీతో సరదాగా’ అనే షో ద్వారా తామిద్దరి మధ్య ఎటువంటి బాండింగ్ ఉన్నదనే విషయాన్ని వెల్లడించారు పెద్దాయన. బాబుమోహన్, నేను మొదట ‘బొబ్బిలి రాజా’ మూవీ చేశాము. అనుకోకుండా మేము ఇద్దరం ‘బొబ్బిలి రాజా’ చిత్రంతో స్క్రీన్ షేర్ చేసుకున్నాం. ఆ తర్వాత వచ్చిన ‘మామగారు’ మూవీ మా ఇద్దరి కెరీర్‌లో ఓ మలుపు తీసుకొచ్చిందన్నారు.

Advertisement

బాబుమోహన్ ఓ మంచి యాక్టర్ మాత్రమే కాదు.. పెక్యులర్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అని పొగడ్తల వర్షం కురిపించారు కోట.. అయితే, మామగారు సనిమా షూటింగ్ టైంలో ‘నేను వాడిని తన్నే సీన్స్ చూసి అందరూ నిజంగానే తన్నాడా.. అని’ అనుకుంటారు.. సినిమా మొత్తంలో అలాంటి తన్నే సీన్స్ చాలా ఉంంటాయి. అన్ని దెబ్బలు బాబుమోహన్ ఎలా భరించాడని చాలా మంది అనుకుంటారు. కానీ అదంతా వాడి గ్రేట్‌నెస్ అని చెప్పా్రు పెద్దాయన..

నేను వాడిని తన్నే సీన్ ప్రారంభంలో.. జస్ట్ నా కాలితో టచ్ చేయగానే వాడు వెళ్లి కింద పడిపోయేవాడు. అంత టైమింగ్ ఉన్న యాక్టర్ బాబు మోహన్. ఆ రోజు వాడు అలా మేనేజ్ చేసి ఉండకపోతే నేను నిజంగానే తన్నాల్సిన సీన్స్ పెట్టేవారు. అదే నిజంగా జరిగితే అప్పుడు అందరూ నన్ను తిట్టుకోవాల్సి వచ్చేదని గుర్తుచేశారు కోట శ్రీనివాస్ రావు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు బెస్ట్ యాక్టర్. ఆ తర్వాత తామిద్దరం 60 నుంచి 70 సన్నివేశాల్లో నటించాం.. ఒక్కోసారి ఇద్దరం కలిసి ప్రయాణాలు కూడా చేసేవారమని చెప్పుకొచ్చారు.
Chiranjeevi : చిరుతో సాయిధరమ్ తేజ్ వాళ్ల నాన్న ఓ సూపర్ హిట్ నిర్మించాడని మీకు తెలుసా..!

Advertisement
Exit mobile version