Karthika Deepam Serial : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియ కుండా ఉండదు. ఈ సీరియల్ టైం అయ్యింది అంటే చాలు ఎక్కడున్నా టీవీల ముందు వాలిపోతారు. ఇందులో డాక్టర్ బాబు, దీప.. తర్వాత మళ్లీ అంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఎవరిది అంటే విలన్ రోల్ పోషిస్తున్న ‘మోనిత’ది అని ఎవరైనా చెబుతారు. ఈ సీరియల్ ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్‌లోనూ దూసుకుపోతోంది. అయితే, ఇందులో మోనిత క్యారెక్టర్ చేసిన నటి పేరు ఆమె తన పర్సనల్ లైఫ్‌లో ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే షాక్ అయిపోతారు.
మోనిత అసలు పేరు శోభా శెట్టి.. ఈమెది కర్ణాటక రాష్ట్రం. కానీ హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. ఈ నటి తెలుగులో పలు సీరియల్స్‌లో చేసింది. కానీ ‘హిట్లర్ గారి పెళ్ళాం’, ‘కార్తీకదీపం’ వంటి సీరియల్ శోభా శెట్టికి మంచి పేరును తీసుకొచ్చాయి. అయితే, ఈ బుల్లితెర నటికి గతంలో ఏ సీరియల్ తీసుకురాని పాపులారిటీని ఒక్క కార్తీక దీపం తీసుకొచ్చిందనడంలో అతిశయోక్తి కాదు.ఈ విడ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటమే కాకుండా ఈ మధ్యే యూట్యూబ్ చానెల్ కూడా స్టార్ట్ చేసింది. ఇందులో ఆమె పర్సనల్ లైఫ్‌ను షేర్ చేసుకుంది. శోభా శెట్టికి ఒక బ్రదర్, టు సిస్టర్స్ ఉన్నారట..
అయతే, ఇటీవల జీ తెలుగు వేదికగా ‘సూపర్ క్వీన్స్’ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవ్వగా.. ఈ షోకు తన పేరెంట్స్‌ను తీసుకుని వచ్చింది శోభా.. వారిని అందరికీ పరిచయం చేసి తాను ఎలా ఇక్కడి దాకా వచ్చాననే విషయాన్ని పంచుకుంది. చిన్నతనంలో చాలా కష్టపడినట్టు చెప్పుకోచ్చింది. తన ఫాదర్ చిన్న వర్క్ చేసేవాడని, కష్టపడి మమ్మల్ని ఇంత వరకు తీసుకొచ్చారని చెప్పింది.
అయితే, తాను పుట్టాక.. తన తాతయ్య ఆడపిల్ల పుట్టిందని ఉయ్యాలతో సహా తనను విసిరేసాడని గర్తుచేసుకుని కంటతడి పెట్టింది. ఆ మాట విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చానని.. ఆడపిల్ల సూపర్ క్వీన్ అని చెప్పడంతో అంతా క్లాప్స్ కొట్టారు.
Read Also : Jai Balaiah-Bunny : ‘జై బాలయ్య’ ఎఫెక్ట్.. బన్నీని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్
- Karthika Deepam serial Oct 12 Today Episode : దీపను చంపడానికి సిద్ధమైన మోనిత..వారణాసికి ఎదురుపడ్డ కార్తిక్..?
- Karthika Deepam : మోనితకు ఊహించని షాక్… దీపతో చేతులు కలిపిన మోనిత వాళ్ల బాబాయ్…!
- Karthika Deepam November 22 Today Episode : సౌర్య ప్లాన్ ని చెడగొట్టిన చంద్రమ్మ దంపతులు.. దీపను చూసి బాధపడుతున్న కార్తీక్?

