Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Kajal agarwal emotional post: డియర్ గౌతమ్.. మన జీవితాల్లో మార్పులు రాబోతున్నాయంటూ కాజల్ పోస్ట్!

తన భర్త గౌతమ్ కిచ్లూని ఉద్దేశిస్తూ… హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. డియర్ గౌతమ్.. ఓ మంచి భర్తగా, నాకెప్పుడూ తోడుగా ఉన్నందుకు, ప్రతి ఆడపిల్ల కోరుకునే తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు అని తెలిపింది. అలసటగా అనిపించి, రాత్రివేళల్లో సరైన నిద్రలేనప్పుడు.. నువ్వు కూడా నాతోపాటే నిద్రలేచి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావంటూ రాసుకొచ్చింది. పుట్టబోయే బిడ్డ కోసం నీవు చాలా కష్టపడుతున్నావని పేర్కొంది. గడిచిన ఎనిమిది నెలల్లో నీలో నేను ఒక గొప్ప తండ్రిని చూశానని వివరించింది.

అయితే త్వరలోనే మన జీవితాల్లో ఎంతో మార్పు రానుందని… ఇప్పటిలా మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోలేకపోయినప్పటికీ సంతోషంగా గడపబోతున్నామని వివరించింది. తనతో మన జీవితంలోని ప్రతిక్షణం మరింత ఆనందంగా మారనుందంటూ పేర్కొంది. నిద్రలేని రాత్రులు, అనారోగ్యానికి గురికావడం, మనకంటూ ఒక సమయాన్ని కేటాయించలేకపోవడం వంటివి ఉన్నప్పటికీ ఇవి మన జీవితాల్లో ఉత్తమమైన క్షణాలని వివరించింది. పరిస్థితులు మారొచ్చు కానీ, నీపై నా ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని.. ఐ లవ్‌ యూ అంటూ కాజల్ తన పోస్టులో వెల్లడించింది.

Advertisement
Exit mobile version