Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Grey Telugu Movie : బ్లాక్ అండ్ వైట్ స్పై డ్రామా… గ్రే మూవీ

Grey Telugu Movie 2022 Press Meet

Grey Telugu Movie 2022 Press Meet

Grey Telugu Movie : బ్లాక్ అండ్ వైట్ స్పై డ్రామా… గ్రే మూవీప్రతాప్‌ పోతన్‌, అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘గ్రే. రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్లకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ… గతంలో మనదేశంలో 12 మంది అణుశాస్త్రవేత్తలు అదృశ్యమయ్యారని, వారిని కనిపెట్టడానికి ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సిస్ ఇన్వెస్టిగేషన్ చేశాయని ఆయన అన్నారు. ఆ ఘటనల నుంచి పుట్టిందే మా ఈ గ్రే చిత్రం అని ఆయన స్పష్టం చేశారు.

Grey Telugu Movie 2022 Press Meet

మనలో చాలా మంది మంచిని తెలుపు గానూ, చెడును నలుపుగానూ చూస్తుంటామన్న ఆయన, ఆ రెండు కలర్స్‌ మధ్యలో కూడా వేరే రంగుల షేడ్స్ ఉంటాయని రాజ్ అన్నారు. మనలో పుట్టే ప్రతీ ఆలోచన వెనక ఎవరూ ఊహించని వింతైన ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయని.. అలాంటి కథాంశాన్ని ఆధారంగా తీసుకొని ఒక స్పై డ్రామాగా తెరకెక్కించిన చిత్రమే ఈ గ్రే అని ఆయన తెలిపారు.

Advertisement

ఇకపోతే అలీ రెజానీ బిగ్‌బాస్ తర్వాత కలిశానని, చాలా మంచి నటుడని రాజ్ అన్నారు. ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, అలీ రెజాతో పాటు ప్ర‌తాప్ పోత‌న్ కూడా ఒక లీడ్ రోల్ చేశారని, ఒక రకంగా చెప్పాలంటే అది సూత్రదారి క్యారెక్టర్ అని ఆయన చెప్పారు.

ఇక హీరోయిన్ ఊర్వశీ రాయ్‌ ఈ చిత్రంతో కథానాయికగా పరిచయమవుతుందన్న ఆయన, ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ కాపీని చూశామని, అందరికీ చాలా బాగా నచ్చిందని, ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరిస్తారని ఆశిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు 40 ఏళ్ల త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో వ‌స్తున్న ఈ మూవీ కోసం, ఎన్నో అంశాల‌ను విశ్లేషించి, రీసెర్చ్ చేసి తీశామని రాజ్ మదిరాజ్ తెలిపారు.

Read Also : Intinti Gruhalakshmi Serial: అభిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తులసి బెయిల్ పేపర్స్ తీసుకురాగానే ఇంతలో మరో షాక్​!

Advertisement
Exit mobile version