Sreeja Konidela:శ్రీజ కొణిదల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిన్న కూతురుగా అందరికీ సుపరిచితమైన ఈమె ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీజ తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలల నుంచి తన భర్త కళ్యాణ్ దేవ్ కి దూరంగా ఉంటున్న శ్రీజ కేవలం తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాళ్లే తన ప్రపంచమని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా తాజాగా శ్రీజ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్టు చూసిన ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శ్రీజ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తన ఫోటోని షేర్ చేస్తూ అన్ని పరిష్కరించబడ్డాయి. ఇకపై నవ్వుతూ కూర్చోవడమే అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడమే కాకుండా, గ్రాటిట్యూడ్, కాంపషన్, కైండ్ నెస్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లను షేర్ చేసింది. ఈ క్రమంలోని ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీజ ఈ విధంగా చేసిన ఈ పోస్ట్ వెనుక దాగిఉన్న అర్థం ఏమిటి అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.