Jabardasth: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ కార్యక్రమం గత తొమ్మిది సంవత్సరాల నుంచి విశేషమైన గుర్తింపు సంపాదించుకొని దూసుకుపోతుంది.ఇకపోతే ఈ కార్యక్రమం మొదట్లో లేడీ కంటెస్టెంట్ లు లేకుండా మగవారే లేడీ గెటప్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసేవారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో కూడా లేడీ కమెడియన్స్ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి పైమా లక్ష నుంచి లక్షా పాతిక వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా వర్ష కన్నా కాస్త తక్కువగా లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనే లేడీ కంటెస్టెంట్ లలో వీరిద్దరికి లక్షలలో పారితోషకం వస్తుంది. మిగిలిన వారికి పాతిక నుంచి 50 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
