Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Director maruthi father dead : డైరెక్టర్ మారుతి తండ్రి కుచలరావు మృతి!

Director maruthi father dead :  ప్రముఖ డైరెక్టర్ మారుతికి పితృవియోగం జరిగింది. ఆయన తండ్రి దాసరి వన కుచల రావు(76) ఈరోజు కన్నుమూశారు. మచిలీపట్నంలోని తన నివాసంలో కుచలరావు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు మారుతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఇస్తున్నారు. కుచల రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Director maruthi father dead

కాగా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, యాడ్స్ డిజైనర్ గా పని చేసిన మారుతి ఈ రోజుల్లో సినిమాతో డైరెక్టర్ గా మారారు. అయితే మారుతి చివరగా మంచి రోజు వచ్చాయనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలోనే పక్కా కమర్షియల్ సినిమాతో సినీ పిర్యులను అలరించున్నారు. త్వరలోనే ప్రభాస్​తో ఓ సినిమా చేయబోతున్నారు. మరి కొద్ది రోజుల్లో అది సెట్స్​పైకి వెళ్లనుంది. ఇక టాలీవుడ్​లో గత రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కన్నుమూశారు. ప్రముఖ నిర్మాత నారంగ్​, సీనియర్​ దర్శకుడు తాతినేని స్వర్గస్తులు అయ్యారు.

Read Also :Director Tatineni Ramarao passed away: ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు మృతి

Advertisement
Exit mobile version