Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Aishwarya Dhanush : ధనుష్, ఐశ్వర్యల విడాకులు ఉత్తుత్తేనంట.. షాకింగ్ నిజాన్ని బయట పెట్టిన ధనుష్ తండ్రి..!

Aishwarya Dhanush : కోలీవుడ్ హీరో ధనుష్, ఆయన భార్య, రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య విడాకులు తీసుకోవాలని రెండు రోజుల క్రితం ప్రకటించారు. ధనుష్, ఐశ్వర్య18 సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకోవడంతో సినీప్రియులతో పాటు సామాన్యులు కూడా షాక్ అయ్యారు. రెండు రోజుల క్రితం ఉమ్మడి ప్రకటన ద్వారా వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే ధనుష్ తండ్రి, తమిళ చిత్రనిర్మాత కస్తూరి రాజా వీరి విడాకుల వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ధనుష్, ఐశ్వర్య విడిపోవడాన్ని కేవలం కుటుంబ కలహాలుగా అభివర్ణించారు.ధనుష్, ఐశ్వర్య 2004లో వివాహం చేసుకున్నారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడంపై ధనుష్ తండ్రి, తమిళ దర్శకుడు కస్తూరి రాజా స్పందించారు.ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్, ఐశ్వర్య విడిపోవడం కేవలం విభేదాల కారణంగానే జరిగిందని వ్యాఖ్యానించారు.

dhanush-aishwaryas-divorce-seems-to-be-on-the-rise-dhanushs-father-reveals-shocking-fact

ఇది సాధారణంగా దంపతుల మధ్య జరిగే కుటుంబ కలహాలు మాత్రమే అని తెలిపారు. ఇది విడాకులు కాదని కస్తూరి రాజా అన్నారు. ధనుష్, ఐశ్వర్య ప్రస్తుతం చెన్నైలో లేరని… ఇద్దరూ హైదరాబాద్‌లో ఉన్నారని చెప్పారు. వారిద్దరితోనూ ఫోన్‌లో మాట్లాడి వారికి కొన్ని సలహాలు ఇచ్చానని కస్తూరి రాజా చెప్పుకొచ్చారు. ధనుష్ తండ్రి చేసిన ఈ వ్యాఖ్యలతో వారిద్దరూ మళ్లీ కలిసిపోతారా ? వాళ్లను మళ్లీ కలిపేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారా ? అనే చర్చ మొదలైంది.

Advertisement

Read Also : Manchu Lakshmi: బుల్లెట్ బండి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన లక్ష్మీ మంచు… ఆచార్య సినిమా పోయిందనే కదా అంటూ నెటిజన్ కామెంట్స్!

Exit mobile version