Deepthi Sunaina: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం వల్ల చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ సోషల్ మీడియా వేదికగా చాలామంది రకరకాల వీడియోలు చేస్తూ పాపులర్ అవుతున్నారు. అలా యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, ఇన్స్టా రీల్స్ చేస్తూ పాపులర్ అయిన వాళ్ళలో దీప్తి సునైనా కూడా ఒకరు. బిగ్ బాస్ సీజన్ 5 లో రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్ తో కలిసి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, వీడియోలలో కనిపించిన దీప్తి సింగిల్ గా కాకుండ జంటగా చాలా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాటిస్పేట్ చేసిన షణ్ముఖ్ కి చివరి దాకా తోడుగా ఉన్న దీప్తి బిగ్ బాస్ ముగిసిన తర్వత షణ్ముఖ్ తో విడిపోవటం వారి అభిమానులూ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో షణ్ముఖ్, సిరిల మధ్య ఉన్న రిలేషన్ షిప్ కారణంగా తమ ఇద్దరి మధ్య ఉన్న ఐదేళ్ల రిలేషన్షిప్ కి దీప్తి బ్రేకప్ చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో షన్ను చేసిన ఓవర్ యాక్షన్ కి హర్ట్ అయిన దీప్తి సోషల్ మీడియాలో ఉన్న షణ్ముఖ్ అకౌంట్స్ అన్ని బ్లాక్ చేసింది. అప్పటి నుండి మరింత రెట్టింపు ఉత్సాహంతో క్యూట్ లుక్స్ తో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రివెంజ్ తీర్చుకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు చేస్తూ తన క్యూట్ లుక్స్ తో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈమె కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.