Deepthi Sunaina: యూట్యూబ్ ద్వారా ఎన్నో వెబ్ సిరీస్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈమె షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి పలు వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు పొందారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమం ద్వారా షణ్ముఖ్ ప్రవర్తన కారణంగా పూర్తిగా నెగిటివిటీ ఎదుర్కొన్న షణ్ముక్ తో దీప్తి సునయన నూతన ఏడాది సందర్భంగా తన ప్రేమకు బ్రేకప్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే దీప్తి సునయన తాజాగా మరో నటుడితో కలిసి మంచుకొండలలో పెళ్లి కూతురు గెటప్ లో, స్టన్నింగ్ లుక్ లో అందరినీ సందడి చేశారు. ఇక మంచు కొండలలో దీప్తి సునయన చేస్తున్న రచ్చ మామూలుగా లేదు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ చెప్పుకొన్న తర్వాత తొందరలోనే వీరిద్దరూ తిరిగి కలుస్తారని ఎంతోమంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరి వ్యవహారం చూస్తుంటే మాత్రం అభిమానుల కోరిక ఇప్పుడే తీరేలా లేదని తెలుస్తోంది.