Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Abhi -Anasuya: నీకిది ఎవరో పెట్టిన బిక్ష కాదు.. యాంకర్ అనసూయ పై అదిరే అభి స్టన్నింగ్ కామెంట్స్?

Abhi -Anasuya: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారిలో అదిరే అభి ఒకరు. ఈ కార్యక్రమంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. అయితే ప్రస్తుతం అభి ఈ కార్యక్రమం నుంచి బయటకు తప్పుకున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ ఒకరు. ఈమె జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఏర్పరచుకుంది. ఇకపోతే తాజాగా వీరిద్దరూ ఓ బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభి అనసూయ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

comedian-abhi-stunning-comments-on-anchor-anasuya

అయితే అభి మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ సందర్భంగా అభి అనసూయ గురించి మాట్లాడుతూ అభి అనసూయని ముద్దుగా అను అని పిలుస్తారు. ఇక అభి మాట్లాడుతూ అను నేను నీ కెరియర్ బిగినింగ్ నుంచి చూస్తున్నాను.కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా అలాగే యాంకర్ గా ప్రస్తుతం నటిగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ ఎంతో ఎత్తుకు ఎదిగావు. ఇలా నీ ఎదుగుదల నీకు ఎవరో పెట్టిన బిక్ష కాదు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఈ స్థానానికి రావాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది నీ కష్టంతో నువ్వు ఈ స్థాయికి వచ్చావు అంటూ అభి అనసూయ గురించి ఎంతో గొప్పగా చెప్పారు.

ఈ విధంగా అభి అనసూయ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన అభి ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమానికి దూరమవుతుందని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఈమె కూడా ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరో అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తున్నారు.

Advertisement
Exit mobile version