Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Cobra Movie Review : కోబ్రా మూవీ రివ్యూ & రేటింగ్.. విక్రమ్ సినిమా ఎలా ఉందంటే?

Cobra Movie Review : తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటించిన మూవీ కోబ్రా (Cobra Movie Release) ఆగస్టు 31 న థియేటర్లలో రిలీజ్ అయింది. విలక్షణ నటుడిగా పేరొందిన విక్రమ్ కోబ్రా మూవీలో 7 పాత్రల్లో కనిపించనున్నాడు. విక్రమ్ ఖాతాలో హిట్ పడి చాలా రోజులు అయిందే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద విక్రమ్ సినిమాలు విఫలమయ్యాయి. కానీ, విక్రమ్ నటించిన మహాన్ మూవీ మాత్రం OTTలో రిలీజ్ మంచి హిట్ టాక్ అందుకుంది. మహాన్ గాంధీ పాత్రలో విక్రమ్ నటన అద్భుతంగా ఉంది. ఇప్పుడు విక్రమ్ మూవీ కోబ్రా (Cobra Movie Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో విక్రమ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాడు అనేది తెలియాలంటే మూవీ రివ్యూను ఓసారి లుక్కేయండి.

Cobra Movie Review : Tamil Actor Chiyaan Vikram Starrer Cobra Movie Review And Rating

స్టోరీ (Movie Story) ఇదే :
గణితశాస్త్ర ఉపాధ్యాయుడి పాత్రలో విక్రమ్ (మతి) నటించాడు. అతడిది సాధారణమైన లైఫ్.. అదే నగరంలో నేరాలు ఎక్కువై పోతాయి. ఎంతగా దర్యాప్తు చేసినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు కనిపించవు. గణితశాస్త్ర టీచర్‌ అయిన మతికి సిటీలో నేరాలకు సంబంధం ఏంటి అనేది స్టోరీ.. పోలీస్ ఆఫీసర్ అస్లాన్ ఆధారాలను దొరకని కేసులను ఎలా ఛేదించాడు అనేది తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమాను చూడాల్సిందే.

నటీనటులు వీరే (Movie Cast) :
హీరో విక్రమ్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్ (క్రికెటర్), మియా జార్జ్, కేఎస్ రవికుమార్, రోషన్ మాథ్యూ, మృణాళిని రవి నటించారు. డైరెక్టర్ ఆర్ అజయ్ జ్ఞానముత్తు రచన, దర్శకత్వం వహించగా.. నిర్మాతగా ఎస్ఎస్ లలిత్ కుమార్ వ్యవహరించారు. సినిమా బ్యానర్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించింది. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ అందించగా.. డీవోపీగా హరీష్ కన్నన్, ఎడిటర్ భువన్ శ్రీనివాసన్ వ్యవహరించారు. 

Advertisement
Movie Name :  Cobra Movie (2022)
Director :   అజయ్ జ్ఞానముత్తు
Cast :  చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, కె.ఎస్. రవికుమార్, రోషన్ మాథ్యూ, ఆనందరాజ్, రోబో శంకర్, మియా జార్జ్, మిర్నాళిని రవి, మీనాక్షి గోవింద్రాజన్
Producers :  S.S లలిత్ కుమార్
Music :  A. R. రెహమాన్
Release Date : 31, ఆగస్టు 2022


కోబ్రా మూవీ ఎలా ఉందంటే? :

కోబ్రా మూవీ చాలా మూవీల మాదిరిగానే ఉంది. స్క్రీన్‌ప్లే అద్భుతంగా వచ్చింది. స్టోరీలో సీన్ తర్వాత సీన్ ఏమి జరుగుతుందనే ఆసక్తి కలుగుతుంది. కోబ్రా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్లు ఆడియెన్స్‌ను బాగా ఎంగేజ్ చేస్తాయి. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మిగతా హాఫ్ మూవీలో తర్వాత ఏం జరుగుతుందో ప్రతి ప్రేక్షకుడు సులభంగా గెస్ చేయగలిగినంతంగా అనిపించింది. సినిమా క్లైమాక్స్‌లో యాక్షన్ సీన్లు అద్భుతంగా వచ్చాయి. విక్రమ్ హాలూసినేషన్ పాయింట్, ఆయన విభిన్నమైన గెటప్స్ ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. ఈ సినిమా విజువల్, గ్రాఫిక్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది.

Cobra Movie Review _ Tamil Actor Chiyaan Vikram Starrer Cobra Movie Review And Rating

ఈ మూవీని ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా సినిమా థియేటర్లలోనే చూస్తే బాగుంటుంది. చియాన్ విక్రమ్ నటన అద్భుతంగా ఉంది. మల్టిపుల్ గెటప్‌లతో విక్రమ్ తనదైన నటనతో అలరించాడు. ఏది ఏమైనా మూవీని చూస్తున్నంత సేపు ప్రేక్షకులను ఒక థ్రిల్లింగ్ వాతావరణాన్ని కలిగించేలా ఉంటుంది. హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి పరిమిత పాత్రలో నటించింది. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ గెస్ట్ రోల్ చేశాడు. విలన్ పాత్రలో రోషన్ మాథ్యూ తన నటనతో మెప్పించాడు. రోబో శంకర్ కామెడీ బాగుంటుంది. మృణాళిని రవి సహా ఇతర తారాగణం తమ పాత్రలకు తగినంతగా చక్కగా నటించారు.

టెక్నికల్ గా చూస్తే.. కోబ్రా మూవీ బాగానే వచ్చింది. మ్యూజిక్ మాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ పాటలు అద్భుతంగా వచ్చాయి. రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మూవీలో హైలైట్‌ అని చెప్పవచ్చు. బాగా ఎలివేట్ చేశాడు. స్క్రీన్‌పై ఎమోషన్లను బాగా పండించారు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ సూపర్.. ఫారిన్ లొకేషన్లలో కొన్ని సీన్లు అద్భుతంగా వచ్చాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Advertisement

గ్రాఫిక్స్ వంటి సన్నివేశాలను మరింత ఆసక్తిగా ఉంటే బాగుండు అనిపించింది. దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్స్ మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేయవచ్చు. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొత్తం మీద.. కోబ్రా మూవీ ఒక విజువల్ ట్రీట్.. యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ప్రతిఒక్కరూ థియేటర్ల వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు.

[Tufan9 Telugu News ]
కోబ్రా మూవీ & రేటింగ్ : 3.24/5

Advertisement
Exit mobile version