Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigg Boss Season 6 : మా అమ్మ ఉరేసుకొని చనిపోయింది.. ఆది కన్నీటి గాథ విని ఎమోషనల్ అయిన కంటెస్టెంట్లు..?

Bigg Boss Season 6 : తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న ఆది రెడ్డి తాజాగా తన జీవితంలో జరిగిన ఒక ఎమోషనల్ సంఘటన గురించి చెప్పుకొని బాధపడ్డాడు. ఆదిరెడ్డి మాటలు విన్న పలువురు కంటెస్టెంట్ లు కూడా ఎమోషనల్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఆది రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. అవి ఏదో ఒక రోజు తొలగిపోతాయి. అప్పటివరకు సహనంగా వేచి చూడాలి అని తెలిపాడు ఆదిరెడ్డి.

అయితే అందుకు ఉదాహరణగా తన లైఫ్ లో జరిగిన ఒక విషయం గురించి పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన తల్లి ఉదంతాన్ని ఉదాహరణ చెప్పాడు. తన తల్లి అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకొని మరణించింది అని ఆదిరెడ్డి చెప్పడంతో చాలామంది షాక్ అయ్యారు. మా అమ్మ చాలా హైట్ గా ఉంటుంది. మా అమ్మ కారణంగానే నేను కూడా ఇంత హైట్ గా ఉన్నాను. కానీ మా అమ్మ చాలా తక్కువ హైట్ ఉన్న బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయింది.

bigg-boss-telugu-6-shocking-sad-story-of-contestant-aadireddi-her-mother-got-suicide

నేను ఆ బాత్రూం చూసిన ప్రతిసారి ఇంత తక్కువ హైట్ లో మా అమ్మ ఎంత ఇబ్బంది పడి చనిపోయింది అన్న బాధ గుర్తుకు వస్తూ ఉంటుంది అనితెలిపాడు ఆదిరెడ్డి. జీవితంలో అప్పు బాధ తీరదు అనుకున్న మా అమ్మ అదే బాధతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. 2013లో మా అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోగా సరిగ్గా ఐదేళ్ల తర్వాత 2018 లో సక్సెస్ అయ్యాను. ఆరోజు మా అమ్మ ఆత్మహత్య చేసుకోక పోయి ఉంటే ఈ రోజు సంతోషంగా ఉండేవారు అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు ఆదిరెడ్డి.

Advertisement

అప్పట్లో మా అమ్మకు కనీసం బంగారు గొలుసు కూడా ఉండకపోవడంతో బంధువుల నగలు పెట్టుకుని ఫంక్షన్లకు వెళ్లేది. కానీ ఇప్పుడు మా అమ్మకు కావలసినంత బంగారం కొనివ్వగలను అని ఆదిరెడ్డి చెబుతూ ఎమోషనల్ అవ్వగా, ఆదిరెడ్డి మాటలు విన్న పలువురు కంటెస్టెంట్లు కూడా ఎమోషనల్ అయ్యరు. అయితే ఇదంతా తాను సింపతి కోసం చెప్పడం లేదని ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయని అవి ఏదో ఒక రోజు తీరతాయి కాబట్టి ఆత్మహత్యలు చేసుకోకూడదు అన్న విషయాన్ని చెప్పడానికే ఈ విషయాన్ని చెప్పాను అని చెప్పుకొచ్చాడు ఆది రెడ్డి.

Read Also : Bigg Boss6 : బిగ్ బాస్ లో ఈవారం కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న కంటెస్టెంట్లు వీళ్లే?

Advertisement
Exit mobile version