Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigg Boss Telugu 6 : బిగ్‌బాస్‌‌లో షాకింగ్ ఎలిమినేషన్.. గీతూ రాయల్‌ను అందుకే బయటకు గెంటేశారా?!

Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ మరింత రసవత్తరంగా మారుతోంది. బిగ్ బాస్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు. ఊహించని కంటెస్టుంట్లు హౌస్ నుంచి ఒకరి తర్వాత మరొకరు వెళ్లిపోతున్నారు. ఈ వారం వెళ్లిపోతురానుకున్న కంటెస్టెంట్లు సేవ్ అయిపోతున్నారు. అందుకే అంటారేమో.. బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా జరగొచ్చు.. ప్రేక్షకుల ఓట్లతోనే కాదు.. బిగ్ బాస్ ఎవరిని హౌస్ లో ఉంచాలి? ఎవరిని బయటకు పంపించాలో కూడా డిసైడ్ చేస్తాడు. ఈ వారం ఎవరూ ఊహించిన విధంగా వెరీ స్ట్రాంగ్ గేమర్ అయిన గీతూ రాయల్ ను ఎలిమినేట్ చేసేశాడు బిగ్ బాస్.

Bigg Boss Telugu 6 _ Geetu Royal elimination from Bigg boss Telugu 6 Season

గీతూ బిగ్ బాస్ నుంచి బయటకు రావడానికి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గీతూ ఎలిమినేషన్ ఫేక్ అంటూ మరికొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. గీతూ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే బయటకు పంపేశారంటూ మరికొంతమంది అంటున్నారు. ఇంతకీ నిజంగానే గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందా? లేదా గీతూను ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూంకు ఏమైనా పంపి ఉంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి టాప్ 5 కంటెస్టెంట్ల లిస్టులో ఉండాల్సిన గీతూ ఇలా సడెన్ గా ఎలిమినేట్ కావడం అందరిని షాకింగ్ గురిచేసింది.

అంతకుముందు వారం ఆర్జే సూర్యను కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ చేసి ఊహించని షాకిచ్చాడు బిగ్ బాస్ . ఇప్పుడు అదే మాదిరిగా చివరి వరకు ఉంటుందనుకున్న గీతూ రాయల్ ను కూడా ఎలిమినేట్ చేసి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. గీతూను ఎలిమినేట్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు బిగ్ బాస్ విశ్లేషకులు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి గీతూ ప్రవర్తన, అతిగా మాట్లాడటం, బిగ్ బాస్ రూల్స్ పదేపపే బ్రేక్ చేయడం, ఇలా మరెన్నో తప్పులు ఉన్నాయని అంటున్నారు.

Advertisement

Bigg Boss Telugu 6 : బిగ్‌బాస్‌‌ బిగ్ ట్విస్ట్.. గీతూ నిజంగానే సీక్రెట్ రూంకు వెళ్లిందా?

హోస్ట్ నాగార్జున కూడా ఎక్కువగా గీతూ విషయంలో ఫేవర్ గా ఉన్నట్టుగా కూడా గుసగుసలు వినిపించాయి. ప్రతివారంలో గీతూ తప్పులను నాగ్ ఎత్తిచూపలేదనే టాక్ నడిచింది. గీతూ ఎలిమినేట్ కావడానికి ఇది కూడా ఒక కారణమనే అంటున్నారు. ఈ వారంలో అందుకే నాగార్జున గీతూ గట్టిగానే క్లాస్ పీకాడు. గీతూ విషయంలో నాగ్ ప్రవర్తనపై ఆడియోన్స్ విపరీతమైన నెగటివ్ టాక్ వచ్చింది. ఇంకా ఎందుకు గీతూను హౌస్ లో ఉంచుతున్నారనే మాట ఎక్కువగా వినిపించిందని అంటున్నారు. గీతూకు ఎక్కువ తుత్తర ఉందని.. ప్రతి గేమ్ విషయంలోనూ తలదూర్చి బిగ్ బాస్ గేమ్ రూల్స్ బ్రేక్ చేస్తుంటదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయంలో నాగ్ కూడా గీతూను గట్టిగానే మందలించడం జరిగింది.

Bigg Boss Telugu 6 _ Geetu Royal elimination from Bigg boss Telugu 6 Season

బొచ్చులో ఆట ఆడుతున్నావని డైరెక్టుగానే గీతూకు వార్నింగ్ ఇచ్చాడు. తానే గేమ్ ఛేంజర్ అని.. తాను లేకపోతే గేమ్ లేదని, తనను చివరి వరకు కొనసాగిస్తారని, ఇక ఎదురులేదు.. తానే విన్నర్ అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉందనే విమర్శలు వినిపించాయి. అదే గీతూ కొంప ముంచినట్టు కనిపిస్తోంది. ఈ వారం గీతూ మూడిందని విశ్లేషకులు సైతం భావించారు. ఈ వారం నామినేషన్లలో 10 మంది కంటెస్టెంట్లు ఉండగా.. వారిలో గీతూ, ఫైమా, మెరీనా మాత్రం తక్కువ ఓటింగ్ వచ్చింది.

అందరూ ఊహించని విధంగా బిగ్ బాస్ గీతూను ఎలిమినేట్ చేసి అందరికి షాకింగ్ ఇచ్చాడు. గీతూ ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రతివారంలానే కొనసాగింది. ఎక్కడ కూడా గీతూను సీక్రెట్ రూంకు పంపిస్తారు అనే హింట్ కూడా ఇవ్వలేదు. దీనిని బట్టి చూస్తే బిగ్ బాస్ షోపై నెగటివిటీ పొగట్టుకోవడానికే బిగ్ బాస్ నిజంగానే గీతూను ఎలిమినేట్ చేసి ఉంటారనే టాక్ వినిపిస్తోంది. గీతూ ఎలిమినేట్ అయిందా? లేదా సీక్రెట్ రూం వెళ్లిందా? అనేది తెలియాలంటే బిగ్ బాస్ రివీల్ చేసేవరకు ఆగాల్సిందే.

Advertisement
Advertisement

Read Also : Pavithra Lokesh : ఆ స్టార్ హీరో నన్ను వాడుకుని వ‌దిలేశాడు.. బాంబు పేల్చిన ప‌విత్రా లోకేష్‌..!

Exit mobile version