Bhavana Emotional Talk : మలయాళం హీరోయిన్ భావనపై ఐదేళ్ల క్రితం లైంగిక దాడి జరిగింది. అప్పటినుంచి భావన న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఇప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు. లైంగిక దాడికి గురైన భావనను సమాజం మాత్రం నిందిస్తూనే ఉంది. సూటిపోటి మాటలతో ఆమెకు మనస్సుకు మరింత గాయమైంది. లైంగిక దాడి ఘటన ఒక పీడకలగా మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెడదామని భావించిన భావనకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి.
అలాంటి పరిస్థితుల్లో తన స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులు ఎంతో అండగా నిలిచారు. వారు ఇచ్చిన ధైర్యంతో భావన ముందుకు సాగింది. అయినప్పటికీ అప్పటినుంచి భావన బయటకు రావడం కూడా మానేసింది. ఈ క్రమంలో 2019 వరకూ సోషల్ మీడియాలో కనిపించలేదు. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసింది. లైంగిక దాడి అనంతరం ఇంకా ఎందుకు బతికే ఉన్నావ్ అంటూ కామెంట్లు వరుసగా వచ్చాయి.
నీలాంటి వాళ్లకు బతికే అర్హత లేదంటూ కామెంట్లు రావడంతో భావన మరింత కృంగిపోయింది. అయినా సరే అలాంటి కామెంట్లను భరించినట్టు చెపుకొచ్చింది భావన.. నేను తప్పు చేయనప్పుడు ఎందుకు సమాజానికి భయపడి దాక్కోవాలి. నా గౌరవం ముక్కలైందని ఎమోషనల్ అయ్యారు భావన.. తనపై జరిగిన లైంగిక దాడిపై న్యాయం జరగాలంటూ కేరళ సీఎంకు భావన లేఖ రాశారు. ఇప్పుడా లేఖ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
ఐదేళ్ల క్రితం హీరోయిన్ భావనను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ లైంగిక దాడికి సూత్రదారిగా మాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ ఉన్నాడంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికీ ఈ కేసు విచారణలోనే ఉంది. లైంగిక దాడికి పాల్పడిన నిందితులకు కూడా శిక్షపడలేదు. ఇప్పటివరకూ కేసులో కూడా ఎలాంటి పురోగతి లభించలేదు.
ఈ నేపథ్యంలోనే భావన న్యాయం కోసం బయటకు వచ్చిన ఆమె ఇలా ఓపెన్ అయ్యారు.. తన కేసుకు సంబంధించి ఏమైందంటూ కేరళ సీఎంకు భావన లేఖ రాశారు. ఇప్పుడా లేఖను చూసిన వారంతా తనకు మద్దతుగా నిలుస్తున్నారని భావన తెలిపింది.
Read Also : Rakul Chhatriwali : రకుల్ చేసిన పనికి ఆమె పేరంట్స్ షాక్.. కండోమ్ టెస్టర్‌గా బోల్డ్ రోల్..!