Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Rajamouli – Mahesh Babu: రాజమౌళి మహేష్ సినిమాలో కీలక పాత్రలో బాలయ్య.. ఖుషి అవుతున్న బాలయ్య అభిమానులు!

Rajamouli – Mahesh Babu: దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR ఈ సినిమా ఈ నెల 25వ తేదీ విడుదల అవుతుంది. ఇక ఈ నెల 25వ తేదీతో సినిమా బాధ్యతలనుంచి రాజమౌళి పూర్తిగా తప్పుకుంటారు.ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం తెరకెక్కబోయే సినిమాతో మహేష్ బాబు బిజీ కానున్నారు. త్రివిక్రమ్ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి మహేష్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇకపోతే ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కబోయే ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే బాలకృష్ణ గెస్ట్ రోల్ లోకాకుండా సుమారు 20 నిమిషాల పాటు ఈ సినిమాలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో తన అభిమాన నటుడిని రాజమౌళి దర్శకత్వంలో చూడాలనే కోరిక బాలకృష్ణ అభిమానులకు ఈ విధంగా నెరవేరబోతోందని బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం అధికారకంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version