Avinash – Anooja: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుని అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లారు. బిగ్ బాస్ తర్వాత పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న ముక్కు అవినాష్ గత ఏడాది అనూజా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసి పార్క్ లో ముక్కు అవినాష్ తన భార్య అనూజతో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మొక్కలు నాటిన అనంతరం అవినాష్ మాట్లాడుతూ భవిష్యత్తులో రాబోయే వారికి కలుషితం లేని పర్యావరణాన్ని అందించడంలో భాగంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉంది.పెళ్లయిన తర్వాత మేమిద్దరం కలిసి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఇలా మొదటిసారిగా మొక్కలు నాటామని అవినాష్ తెలియజేశారు. ఇక ముక్కు అవినాష్ గెటప్ శ్రీను, కెవ్వు కార్తీక్, కిరాక్ ఆర్పీ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.
