Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Kili Paul: టాంజానియా కిలి పాల్ పై హత్యాయత్నం.. ఆస్పత్రి పాలైన ఇంటర్నెట్ సెన్సేషన్!

Kili Paul: టాంజానియా కీలి పాల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇతను ఎంతో సుపరిచితమే. తన అద్భుతమైన డాన్స్ వీడియోలతో అందరిని సందడి చేసిన కిలీ పాల్ పై దుండగులు హత్యాయత్నం చేశారు ఈ క్రమంలోని ఇతనిపై కర్రలతో దాడి చేయగా ఈయన ప్రస్తుతం ఆసుపత్రి పాలయ్యారు. కిలి పాల్ బాలీవుడ్ తో పాటు ఇతర భాష చిత్రాలలోని పాటలకు అద్భుతమైన రీల్స్ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న కిలి ఫాల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

టాంజానియాకి చెందిన అన్నా చెల్లెల్లు కిలిపాల్‌, నీమాపాల్‌లు. వీరు తెలుగులో కూడా పుష్ప పాటలకు అద్భుతమైన డాన్స్ లు చేశారు. ఇలా డాన్స్ రీల్స్ ద్వారా
ఎంతో ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న వీరిపై ఎవరో కర్రలతో విపరీతంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం అవుతూ ఆస్పత్రి పాలయ్యారు. ఈ సందర్భంగా కిలి పాల్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

కొందరు తనని కింద పడేయాలని చూస్తున్నారు. అయితే ఆ దేవుడు మాత్రం తనకు సహాయం చేస్తూ ఉన్నాడు నాకోసం ప్రార్థించండి అంటూ ఈయన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తన చేతి వేళ్ళకు, ఒంటి పై తీవ్రమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడూ ప్రేక్షకులను సందడి చేసే ఇతనిపై ఎవరు హత్యాయత్నం చేసి ఉంటారు? తనపై హత్యాయత్నం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Exit mobile version