Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Alitho Saradaga Talk Show : ఆ పెద్దాయన నా చెంప పగులకొడితే బుద్ది వచ్చింది..!

alitho-saradaga-talk-show-venkat-abot-anr

Alitho Saradaga Talk Show : ఈటీవీలో ప్రసారం అయ్యే ఆలీ టాక్ షో ఆలీతో సరదాగా లో ఈ వారం హీరో వెంకట్ సందడి చేయబోతున్నాడు. అతడి తో ఆలీ పలు ఆసక్తికర విషయాలను చెప్పినట్లుగా తాజాగా విడుదలైన ప్రోమో లో చూపించారు. హీరోగా కెరీర్ ఆరంభించిన వెంకట్ ఆ తర్వాత తక్కువ సమయం లోనే పేడ్ అవుట్ అయ్యాడు. మళ్లీ ఇప్పుడు హీరో గా కనిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టు గా మాత్రమే అతనికి ఆఫర్లు వస్తున్నాయి.

హీరోగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎలా అయినా కనిపించేందుకు అయినా సిద్ధం అన్నట్లుగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు వెంకట్ చెప్పుకొచ్చాడు. ఇక తన కెరీర్ ఆరంభం లో శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే సినిమా లో అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి వెంకట్ నటించాడు. ఆ సినిమా షూటింగ్ సమయం లో ఒక సన్నివేశంలో పదే పదే రీటేక్ తీసుకుంటున్నా అంటూ అక్కినేని నాగేశ్వరరావు గారు చెంప మీద ఒక్క దెబ్బ గట్టిగా కొట్టారు. ఆ దెబ్బతో మొత్తం మారిపోయింది.

Alitho Saradaga Talk Show : హీరో వెంకట్ సందడి..

నేను నా నటన మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ మహానుభావుడు దెబ్బ కొట్టి నేర్పించడం వల్ల నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న అంటూ వెంకట్ గుర్తు చేసుకున్నాడు. ఇక ఒక సినిమా షూటింగ్ సందర్భంగా అయిన యాక్సిడెంట్ తో కెరీర్ మొత్తం స్పాయిల్ అయిందని వెంకట్ బాధపడ్డాడు. పూర్తి ఎపిసోడ్ లో మరిన్ని విషయాలను వెంకట్‌ వెల్లడించే అవకాశం ఉంది.

Advertisement

ఇండస్ట్రీ లో పలువురి తో పరిచయాలు ఉన్న వెంకట్ ప్రేమ లో ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అతను పెళ్లి చేసుకోలేదు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే విషయం లో కూడా పూర్తి ఎపిసోడ్ లో వెంకట్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. ఎప్పటిలాగే వెంకట్‌ తో కూడా సరదాగా అలీ తన టాక్‌ షో ను సాగించాడు అని ప్రోమో చూస్తే అనిపిస్తుంది.

Read Also : Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?

Advertisement
Exit mobile version