Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Poorna Marriage : సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పూర్ణ.. అందుకే ఎవరినీ పిలవకలేకపోయిందట!

Poorna marriage : అవును సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ మహాలక్ష్మి సినిమాతో 2007లో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి బహుబాషా నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. లడ్డు బాబు, నువ్వులా నేనిలా, శ్రీమంతుడు, రాజుగారి గది, జయమ్ము నిశ్చయమ్మురా, దృశ్యం 2, అఖండ వంటి సినిమాల్లో నటించి ఆమె ప్రస్తుతం పలు టీవీ షోల్లో జడ్దిగా వ్యవహరిస్తోంది.

Porna gives clarrity about her secret marriage news

అయితే తాజాగా పూర్ణ కేరళ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. మరియు త్వరలో పెళ్లికి సిద్ధం అవుతుందని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. అయితే పూర్ణ ఇటీవల తనకు లవర్ ఉన్నాడన్న విషయాన్ని ఇద్దరు క్లోజ్ గా దిగిన ఫొటోలతో సహా సోషల్ మీడియాలో పోస్టే చేసింది. అయితే పూర్ణ ప్రియుడి పేరు అసీఫ్ అలీ.. ఈయన దుబాయ్ లో ఒక ప్రముఖ వ్యాపారవేత్త. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయారని.. మనస్పర్థల కారణంగా వీరి ప్రేమ బ్రేకప్ అయిందని కొన్ని ప్రచారంలోకి వచ్చాయి.

Porna gives clarrity about her secret marriage news

ఈ విషయంపై స్పందిస్తూ ఈ ఏడాది మే 31వ తేదీన నిశ్చితార్థం జరిగిందని.. జూన్ నెల 12వ తేదీన దుబాయ్ లో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి జరిగిందని తెలిపింది. అయితే దేశ సమస్య కారణంగా పులవురు తమ పెళ్లి వేడుకల్లో పాల్గొనలేకపోయారని.. దీంతో త్వరలోనే కేరళలో రిసిప్షన్ నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పూర్ణ పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Read Also : Mahesh babu : మహేష్ బాబు లవ్ స్టోరీ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన మంజుల..!

Exit mobile version