Actress Poorna : అందాల ముద్దుగుమ్మ నటి పూర్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. యూఏఈకి చెందిన ఓ బడా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందట.. కేరళలో వీరిద్దరు ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. ఎంగేజ్మెంట్లో పూర్ణ వైట్ డ్రెస్‌లో చందమామలా మెరిసిపోతోంది. తన అందాలతో కుర్రకారు మతులు పొగడుతోంది. మరోపక్క బుల్లితెరపై షో లకు జడ్జిగా కూడా పూర్ణ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పూర్ణ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కి గట్టి షాక్ ఇచ్చింది. యూఏఈకి చెందిన అసిఫ్ అలీనీ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించింది.
పూర్ణ కాబోయే భర్త అసిఫ్ అలీ జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సీఈవో, ఫౌండర్ అన్న సంగతి తెలిసిందే. జమా మెహరి అనే సంస్థను స్థాపించిన ఆయన.. ఆ సంస్థ ద్వారా వీసాలను అందిస్తుంటాడు. ఫ్లైట్ టికెట్ వంటి సర్వీసులను కూడా ఈ సంస్థ ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఇతను కాజల్, ప్రియమణి, విజయ్ సేతుపతి వంటి సెలబ్రిటీలకు కూడా వీసాలను ఏర్పాటు చేశాడు.