Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Actress Namitha Twin Boys : హీరోయిన్ నమితకు కవలలు పుట్టారు.. ఇద్దరు అబ్బాయిలే.. వీడియో వైరల్!

Actress Namitha Twin Boys : సినీనటి, హీరోయిన్ నమిత గురించి పరిచయం అక్కర్లేదు. చాలా తెలుగు సినిమాల్లో ఈ అమ్మడు నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు సినిమాల ద్వారా హీరోయిన్ మంచి అవకాశాలను అందిపుచ్చుకుంది గుజరాత్ భామ.. ప్రత్యేకించి సొంతం సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్‌కు జోడీగా జెమినీతో రెండో మూవీ చేసింది.

Actress Namitha Twin Boys _ Actress Namitha delivers twin boys, shares Good news on social media

ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయింది. జెమినీ మూవీ హిట్ కావడంతో నమితకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇతర భాషల మూవీల్లోనూ చేస్తూనే తెలుగు మూవీలు కూడా చేస్తూ వచ్చింది. అందులో ఒక రాజు ఒక రాణి, బిల్లా, ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి మూవీల్లో నటించింది. తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్ భాషల మూవీల్లోనూ నటించింది. తమిళనాడులో నమితకు ఏకంగా గుడి కూడా కట్టేశారు. అంతగా నమిత తమిళ ప్రేక్షకులకు దగ్గర అయింది. అలా చెన్నైలోనే సెటిల్ అయింది.

నటుడు, వ్యాపారవేత్త అయిన వీరేంద్ర చౌదరి అనే తెలుగు వ్యక్తిని ప్రేమించి నమిత పెళ్లాడింది. 2017లో నమిత పెళ్లి జరిగింది. అప్పటికీ కూడా కొన్ని సినిమాల్లో నమిత నటించింది. నమిత తాను ప్రెగ్నెంట్ కావడంతో పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తాను తల్లిని కాబోతున్నానంటూ తన 41వ పుట్టిన రోజున చెప్పింది. అప్పటినుంచి నమిత తన బేబీ బంప్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.

Advertisement

Actress Namitha Twin Boys : కవలలను ఎత్తుకుని భర్తతో నమిత.. వీడియో వైరల్..  

భర్తతో కలిసి బేబీ బంప్ తో దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా నమిత ఇద్దరు కవలలకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. కవలలు ఇద్దరు అబ్బాయిలేనని తెలిపింది. ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నానని, అందరి ఆశీస్సులు తమకు కావాలని నమిత కోరింది. ఇద్దరు కవల పిల్లలను నమిత ఎత్తుకొని భర్తతో ఉన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Actress Namitha Twin Boys : Actress Namitha delivers twin boys, shares Good news on social media

నాకు ట్విన్ బాయ్స్ పుట్టారంటూ పోస్ట్ పెట్టింది. కృష్ణాష్టమి రోజున ఈ సంతోషకరమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది. మీ ఆశీర్వాదాలు, ప్రేమ ఎల్లప్పుడూ మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాని తెలిపింది. హాస్పిటల్ సిబ్బందికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. నన్ను ప్రెగ్నెన్సీ టైంలో వాళ్లు చాలా గైడ్ చేశారని, నా పిల్లలను బయట ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి ఎప్పుడు రుణపడి ఉంటానని పోస్ట్ చేసింది. నమితకు కవల పిల్లలు పుట్టారని పలువురు ప్రముఖులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నమిత అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే.. నమిత అప్పట్లోనే బీజేపీలో చేరింది. ప్రస్తుతానికి అడపాదడపా మూవీలు చేస్తూ బిజీబిజీగా గడిపేస్తోంది.

Advertisement

Read Also : Namitha baby bump : బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన నమిత.. ముద్దుగా ఉన్నావంటూ కామెంట్లు!

Exit mobile version