- టీ అమ్మే వ్యక్తి కొడుకు మొదట ఇంజనీర్ అయ్యాడు
- ఆపై కష్టపడి చదివి IAS అధికారి అయ్యాడు
- చిన్న వయసులోనే కష్టపడి పనిచేయాలని పేదరికం నేర్పింది
- తండ్రి అతనికి విద్య విలువను నేర్పించాడు
- IIT-JEE, ఆపై UPSC పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు
UPSC Success Story : అతడికి చదువే లక్ష్యం. అదే అతడ్ని ఐఏఎస్ అధికారి అయ్యేలా చేసింది. తన చదువుకు పేదరికం అడ్డుకాలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుదిరగలేదు. తండ్రి టీ కొట్టు నడుపుతూ కొడుకుని బాగా చదివించాడు. తండ్రి కష్టాన్ని చూసి పెరిగిన అతడు ఇప్పుడు యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి చివరికి కలెక్టర్ వంటి ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఒక పనిపట్ల అంకితభావం ఉంటే విజయం దానంతట అదే వస్తుందని నిరూపించాడు.
అతడు ఎవరో కాదు.. రాజస్థాన్‌లోని ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన దేశాల్ చరణ్ దాన్. దేశల్ విజయగాథ ఎందరికో ఆదర్శం.. కష్టపడి పనిచేయడం, పోరాటం, ఎప్పటికీ వదులుకోని స్ఫూర్తితో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. ఐఐటీ-జేఈఈ మాత్రమే కాకుండా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాడు.
ఈ రెండు ప్రతిష్టాత్మక పరీక్షలు దేశంలోనే అత్యంత కఠినమైనవి. అయినప్పటికీ దేశాల్ రెండింటిలోనూ భారీ స్కోర్ సాధించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. యువతకు ఆదర్శనంగా నిలుస్తున్నాడు. దేశాల్ ఒక నిరుపేద కుటుంబం నుంచి ఐఏఎస్ అధికారి ఎలా అయ్యాడో సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
UPSC Success Story : గ్రామంలో తండ్రి టీ దుకాణం :
దేశల్ దన్ చరణ్ రాజస్థాన్‌లోని సుమలై గ్రామంలోని ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. తండ్రి కుశాల్దన్ చరణ్ గ్రామంలో ఒక చిన్న టీ స్టాల్ నడిపేవాడు. 10 మంది కుటుంబాన్ని పోషించేవాడు. తండ్రి తన పిల్లలను ఎలాగైనా చదివించాలని నిశ్చయించుకున్నాడు. తండ్రిగా తన పిల్లల చదువుకు అవసరమైన అన్నింటిని సమకూర్చాడు.
చదువు కోసం తండ్రి అప్పు చేసి :
తండ్రి కుశాల్దన్ చరణ్ పిల్లల చదువు కోసం బాగా శ్రమించాడు. తన పిల్లలను పని చేయమని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. తన టీ దుకాణం ఇంటి ఖర్చులకు సరిపోలేదు. తన పిల్లల చదువుకు నిధులు సమకూర్చుకోవడానికి అనేక రుణాలు తీసుకున్నాడు. పిల్లల భవిష్యత్తు కోసం అప్పు చేసినా పర్వాలేదని భావించాడు. అలా పిల్లలందరిని చదివించాడు.
సోదరుడిని కోల్పోయిన బాధలోనూ.. :
దేశాల్‌కు ఏడుగురు తోబుట్టువులు. వారిలో ఒక సోదరుడు భారత నావికాదళంలో చేరారు. ఒకరోజు, పెద్ద సోదరుడు జలాంతర్గామి ప్రమాదంలో మరణించాడని తెలిసింది. ఆ సమయంలో దేశాల్ 10వ తరగతి చదువుతున్నాడు. ఈ సంఘటనతో కుటుంబం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అయినప్పటికీ, తన తండ్రితో పాటు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. దేశాల్ చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అధికారి కావాలని కలలు కన్నాడు.
ఆ వెంటనే JEE పరీక్షలో పాస్ అయ్యాడు :
12వ తరగతి పూర్తి చేసిన తర్వాత దేశాల్ ఇంజనీరింగ్‌లో కెరీర్ కోసం ప్రయత్నించాడు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష (JEE) మెయిన్‌కు రెడీ అయ్యాడు. మొదటిసారి పరీక్ష రాసి భారీ మార్కులు సాధించాడు. దేశాల్ ఐఐటీ జబల్‌పూర్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీని పొందాడు. ఆపై ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించేవాడు. అయితే, IAS అధికారి కావాలనే అతని కల నెరవేరలేదు. అందుకే మరో అవకాశం కోసం సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యాడు.
మొదటి ప్రయత్నంలోనే UPSCలో 82వ ర్యాంకు :
ఇంజనీరింగ్ పూర్తి చేశాక దేశాల్ UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం ఢిల్లీకి వెళ్లాడు. తనకు ఎక్కువ సమయం లేదని యూపీఎస్సీ పరీక్షకు కష్టపడి చదివాడు. అతని కృషికి ఫలితం దక్కింది. 2017లో, దేశాల్ మొదటిసారి యూపీఎస్సీ పరీక్ష రాసి 82వ ర్యాంకు సాధించి IAS అధికారి అయ్యాడు. తన కల నిజమైంది. 2023 నాటికి రాజస్థాన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆశిస్తున్నారు.

