Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

APPSC Recruitment 2025 : ఇంటర్ పాసైతే చాలు.. ప్రభుత్వ ఉద్యోగం పక్కా.. నెలకు రూ. 80 వేల వరకు జీతం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

APPSC Recruitment 2025

APPSC Recruitment 2025

APPSC Recruitment 2025 : గవర్నెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే, అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలు మొత్తం 691 పోస్టులకు నియామకం చేపట్టనుంది.

ఆసక్తిగల అభ్యర్థులు అర్హత గల అభ్యర్థులు 16 జూలై 2025 నుంచి APPSC (psc.ap.gov.in) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 5 ఆగస్టు 2025 వరకు సమయం అందుబాటులో ఉంది.

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నియమాకంలో ఎంపిక అయ్యేందుకు అభ్యర్థులు ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ రాయాలి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాయాలి. స్క్రీనింగ్, మెయిన్ పరీక్షలు రెండూ OMR షీట్లలో ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షల తేదీలను తరువాత ప్రకటించనున్నారు.

Advertisement

APPSC Recruitment 2025 : ఎంత జీతం వస్తుందంటే? :

APPSC రిక్రూట్‌మెంట్ 2025 కింద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) నెలకు రూ. 25,220 నుంచి రూ. 80,910 వరకు జీతం పొందవచ్చు. అదే సమయంలో, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుకు జీతం రూ. 23,120 నుంచి రూ. 74,770 మధ్య ఉంటుంది.

ఏపీపీఎస్‌సీలో మొత్తం 691 పోస్టులకు ఈ నియామకం జరిగింది. ఇందులో 256 పోస్టులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), 435 పోస్టులు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) ఉన్నాయి. ఈ పోస్టులక సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయొచ్చు.

Read Also : RRB NTPC Exam 2025 : రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయి.. NTPC పరీక్ష షెడ్యూల్ ఇదిగో.. ప్రిపరేషన్ టిప్స్ మీకోసం..!

Advertisement

APPSC Recruitment 2025 : దరఖాస్తుకు అర్హతలివే :

APPSC రిక్రూట్‌మెంట్ 2025 అర్హతల విషయానికి వస్తే.. అభ్యర్థి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అదే సమయంలో, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల వయస్సు జూలై 1, 2025 నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపు ఉంటుందని గమనించాలి.

APPSC రిక్రూట్‌మెంట్ 2025 ఎలా అప్లయ్ చేయాలంటే? :

Exit mobile version