Vastu Tips : భార్యాభర్తల జీవితంలో బెడ్ రూమ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రాత్రి బెడ్ రూమ్‌లో నిద్రపోయే సమయం నుంచి ఉదయం నిద్రలేచే వరకు భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం అలాగే దూరం కూడా పెరుగుతుంది. అందుకే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేకుండా ఉండాలంటే (Vastu Tips For Happy Married Life) వాస్తు ప్రకారం కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
ఇంట్లో ఉంచిన ప్రతి చిన్న, సాధారణ వస్తువు కూడా వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని గమనించాలి. భార్యాభర్తల జీవితంలో చిన్న విషయాలు కూడా పెద్ద తగాదాలకు దారితీస్తాయి. వాస్తుకు విరుద్ధమైన ఏదైనా ప్రతికూల వస్తువు బెడ్ రూమ్‌లో ఉంచితే భార్యాభర్తల సంబంధాన్ని చాలా త్వరగా ప్రభావితం చేస్తుంది. భార్యాభర్తల జీవితాన్ని సంతోషంగా ప్రేమతో ఉండాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం నియమాలను పాటించాలి. ఫెంగ్ షుయ్ గదిలో ఉంచడం ద్వారా వైవాహిక జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది.
Vastu Tips For Couple Bedroom : బెడ్ రూంలో అద్దం ఉండొద్దు :
బెడ్ రూమ్‌లో భార్యాభర్తల ఆనందంపై చెడు ప్రభావం చూపే అనేక విషయాలు ఉన్నాయి. ఇందులో తప్పు దిశలో ఉంచిన అద్దం కూడా ఒకటి. వాస్తు శాస్త్రం ప్రకారం.. భార్యాభర్తల జీవితంలో నిద్రపోతున్నప్పుడు వారి ప్రతిబింబం అద్దంలో కనిపిస్తే వారి జీవితంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.
Read Also : Kaal Sarp Dosh Puja : కాల సర్ప దోషం ఏంటి? మీ జాతకంలో దోషం ఉంటే కనిపించే లక్షణాలేంటి? నివారణకు ఏం చేయాలి?
అద్దం దోషపూరిత ప్రభావం ఇద్దరి మధ్య గొడవలను పెంచుతుంది. వాస్తుతో పాటు గ్రహాలు, నక్షత్రాలు కూడా చెడుగా ఉన్నప్పుడు గ్రహ సంఘర్షణ, ఉద్రిక్తత కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు, వాగ్వాదాలు పెరుగుతాయి. అలాంటి పరిస్థితిలో, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయే అవకాశాలు పెరుగుతాయి.
Vastu Tips : బెడ్ రూంలో అద్దం ఉంటే ఇలా చేయండి :
వాస్తు శాస్త్రం ప్రకారం.. అద్దం నెగిటివ్ పరిస్థితులను సృష్టిస్తుందని గుర్తుంచుకోవాలి. బెడ్ రూమ్‌లో అద్దం ఉంటే భార్యాభర్తలు రాత్రి నిద్రపోయేటప్పుడు దానిపై ఒక తెర కప్పాలి. బెడ్ రూమ్‌లో ఎక్కడా అస్పష్టంగా, అరిగిపోయిన లేదా విరిగిన అద్దం ఉండకూడదు. ఇలా ఉంటే భార్యాభర్తల సంబంధంలో కూడా అలాంటి గొడవలను సృష్టిస్తుంది.
అద్దం కాకుండా అల్మారా ఉంచే స్థలం, నిద్రించే దిశ, గ్రహ స్థానం ప్రకారం కలర్ కర్టెన్లు, బెడ్ షీట్ల వాడకం ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు.. శని లేదా రాహువు భర్త లేదా భార్యలో ఎవరికైనా ప్రతికూల స్థితిలో ఉంటే.. బెడ్ రూమ్‌లో బ్లూ కలర్ బెడ్ షీట్లు, కర్టెన్లు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.