Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Vast Tips: ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా..? ఈ మొక్క నాటితే చాలు మీ సమస్యలన్నీ దూరం..!

Vast Tips: మనదేశంలో పురాతన కాలం నుండి వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇల్లు నిర్మించుకోవడం దగ్గర నుండి ఇంట్లో వస్తువులు ఏర్పాటు చేసుకునే విధానం వరకు అన్ని వాస్తు ప్రకారం పాటిస్తారు. ఇలా ఇంట్లో ప్రతి వస్తువు వాస్తు ప్రకారం ఉంచుకోవడం వల్ల ఇంట్లో ఎటువంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అయితే ప్రతి ఇంట్లో మొక్కలను కూడా వాస్తు ప్రకారం ఉంచుతారు. ఈ క్రమంలో మనీ ప్లాంట్, తులసి వంటి ఆదాయానికి ప్రత్యేకంగా నిలిచే మొక్కలను కూడా వాస్తు ప్రకారం ఉంచుకోవాలి. ఈ మొక్కలే కాకుండా ఇంట్లో క్రాసులా మొక్కను వాస్తు ప్రకారం ముంచటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

క్రాసుల మొక్కను ఇంట్లో తూర్పు దిశ లేదా ఉత్తరం దిశ వైపు ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ మొక్క ఇంట్లో ఉంచటం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఇల్లు లేదా కార్యాలయంలో వాస్తు ప్రకారం మీ మొక్కను ఉంచటం వల్ల వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది. ఇక కార్యాలయాలలో ఈ మొక్కని నాటాలనుకునేవారు వాస్తు ప్రకారం నైరుతి దిశలో ఉంచాలి. ఇలా నైరుతి దిశలో క్రాసుల మొక్కను ఉంచటం వల్ల ఉద్యోగ పరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.

Advertisement

Vast Tips:

క్రాసుల మొక్కను పొరపాటున కూడా చీకటి ప్రదేశంలో ఉంచరాదు ఈ మొక్కను ఎప్పుడు సూర్యకిరణాలు పడే చోట ఉంచటం చాలా ఉపయోగాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ చెట్టు ఆకులను ఎప్పుడు శుభ్రంగా శుభ్రమైన గుడ్డతో తుడుచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇక పొరపాటున కూడా ఈ గ్రాసుల మొక్కని ఇంటి ముఖద్వారం ఎదురుగా ఉంచరాదు. పొరపాటున ఇంటి ముఖద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రాసుల మొక్కను వంటగది లేదా బెడ్ రూమ్ అంటే ప్రదేశాలలో కూడా ఉంచరాదు. క్రాసుల మొక్కను వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఇతర సమస్యలు కూడా దూరం అవుతాయి.

Exit mobile version