Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Somvati Amavasya : నేడే సోమవతి అమావాస్య… పితృ దోషంతో బాధపడేవారు ఈ పరిహారం చేస్తే చాలు..?

Somvati Amavasya : సాధారణంగా ప్రతి నెల అమావాస్య పౌర్ణమిలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే మే నెలలో నేడు అమావాస్య వచ్చింది.ఈ అమావాస్య సోమవారం రావటం వల్ల ఈ అమావాస్యను సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఈ విధమైనటువంటి అమావాస్య తిథి 30 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. అందుకే ఈ అమావాస్యను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా పిత్రు దోషాలతో బాధపడేవారికి దోషాలను పరిహారం చేసుకోవడం కోసం నేడు ఎంతో శుభప్రదమైన దినం అని చెప్పవచ్చు. మరి పితృ దోష పరిహారం కోసం ఏం చేయాలి అనే విషయానికి వస్తే…

Somvati Amavasya

ఈరోజు ఉదయం స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి పితృదేవతలకు పిండప్రదానం చేయడం వల్ల వారికి ఆత్మశాంతి కలిగి పితృ దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా నేడు బ్రాహ్మణులకు ఇతరులకు ఆహారం దానం చేయడం మంచిది. స్వయంగా మన చేతులతో వండిన ఆహారాన్ని దానం చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి. అలాగే బ్రాహ్మణులకు ఆహార ధాన్యాలను దానం చేసి దక్షణ సమర్పించడం వల్ల దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

New Ration Card : కొత్త రేషన్‌ కార్డుదారులకు పండగే.. సెప్టెంబర్ 1 నుంచి నెలవారీ సన్న బియ్యం తీసుకోవచ్చు..!

ముఖ్యంగా పితృ దోషాలు తొలగిపోవాలంటే నేడు రావిచెట్టుకు ప్రత్యేక పూజలను చేయడం వల్ల పితృ దోషాలు సైతం తొలగిపోతాయి. రావిచెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని, అలాగే ఈ చెట్టు వేర్లు కాండం మొదలులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారని భావిస్తారు. అందుకే ఈ సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దానధర్మాలు చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోయి ఎంతో సుఖ సంతోషాలను పొందుతారని పండితులు చెబుతున్నారు.

Advertisement

Read Also :Goddess Laxmidevi : ఇంట్లో ఆడాళ్లు ఇలా ఉంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలి వెళ్లదు!

Raksha Bandhan 2025 : రక్షాబంధన్ నాడు మీ సోదరికి ఈ 5 వస్తువులను అసలు గిఫ్ట్‌గా ఇవ్వొద్దు.. గొడవలతో విడిపోతారు జాగ్రత్త..!
Advertisement
Exit mobile version