Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి లక్ష్మీ దేవి ఆశీస్సులు.. అన్నీ శుభాలే!

Horoscope : ఈ వారం అనగా ఆగస్టు 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఈ సమస్యలు తప్పవని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళ్లకు శుభకాలం. మొదలుపెట్టిన పనులను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధు,మిత్రులతో అతి చనువు వద్దు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఏకాగ్రతతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. నమ్మిన ధర్మమే ముందుకు నడిపిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో వారి సూచనలతో సమస్య తొలగతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

Advertisement

కుంభ రాశి.. కుంభ రాశి వాళ్లకు ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. అభద్రతా భావాన్ని రానివ్వవద్దు. మిత్రుల సూచనలు తీసుకోవాలి. మీరు ఏ పని మొదలు పెట్టినా లాభాలే. కాబట్టి మీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఈరోజు చక్కగా మొదలు పెట్టుకోవచ్చు. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది.

Exit mobile version