Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Devotional Tips: ఆర్థిక సమస్యలు తొలగి పోవాలంటే ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాల్సిందే!

Devotional Tips: సాధారణంగా చాలామంది ఎంతో కష్టపడి పనులు చేస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి. ఇలా అధిక సమస్యలు చుట్టుముట్టడంతో ఎంతో ఆందోళన చెందుతూ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ విధంగా అధిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఎన్నో రకాల పరిహారాలు కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం ఎంతో మంచిది.

అయితే మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగి పోవడానికి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు తొలగి పోవు.లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా కాకుండా మనం ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆ విగ్రహం మన కంటికి కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి.

ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో పాటు మానసిక ఆందోళనలు కూడా తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇక సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలుగుతుంది. ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉండటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. వ్యాపారాలు చేసే చోట ఆఫీసులలో ప్రధాన ద్వారం దగ్గర లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవటం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా ఎలాంటి నరదృష్టి కూడా ఉండదు.

Advertisement
Exit mobile version