Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Money Plant : ఆర్థిక సమస్యలు తొలగి ధనవంతులు కావాలంటే ఈ ఒక్క వస్తువు మనీ ప్లాంట్ కి కడితే చాలు..!

Money Plant : సాధారణంగా అందరి ఇళ్లలో మనీ ప్లాంట్ ని పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ మనీ ప్లాంట్ ని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నుండి ఆర్టిక ఇబ్బందులు తొలగిపోతాయని అందరి నమ్మకం. అయితే ఈ మనీ ప్లాంట్ నాటే విషయంలో కూడా కొన్ని పద్ధతులు ఆచరించాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఇంట్లో మనీ ప్లాంట్ ని పెంచుకోవడం చాలా అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

if-you-want-to-get-rid-of-financial-problems-and-become-rich-just-tie-this-for-money-plant

సాధారణంగా ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల ఇల్లంతా పచ్చదనంతో చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇతర మొక్కలతో పాటు మనీ ప్లాంట్ కూడా పెంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో పాటు ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈరోజు మనీ ప్లాంట్ గురించి ఎలా పెంచాలి? మనీ ప్లాంట్ పెంచటం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. మన ఇంట్లో మనీ ప్లాంట్‌ను సరైన దిశలో, సరైన స్థలంలో ఉంచినట్లయితే అది ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తుంది. అయితే మనీ ప్లాంట్‌లో ఒక వస్తువును వేయడం ద్వారా ఈ మొక్క దాని రెట్టింపు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు తెలియచేస్తున్నారు. ఈ రోజు మనీ ప్లాంట్‌ కు ఏం కట్టాలి? దాని నియమాలు ఏమిటి? అని తెలుసుకుందాం.

Money Plant : ధనవంతులు కావాలంటే మనీ ప్లాంట్ కి కడితే చాలు..!

మనీ ప్లాంట్ ని ఎప్పుడూ ఈశాన్య దిశలో నాటాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మనీ ప్లాంట్ ని ఎప్పుడు శుభ్రమైన ప్రదేశంలో నాటాలి. అంతేకాకుండా మనీ ప్లాంట్ ని నేల మీద నాటకూడదు. ఎందుకంటే ఈ చెట్టు ఆకులు నేల వైపు పెరుగుతాయి. అందువల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావాలు చూడవచ్చు. శుక్రవారం రోజు మనీ ప్లాంట్ కి ఎర్రదారం కట్టడం వల్ల ఇంట్లో అనుకూల ప్రభావం ఉంటుంది . ఇలా ఎర్ర దారం కట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి సుఖ, సంతోషాలు చేకూరుతాయి.

Advertisement

Read Also :  Money plant : మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. అయితే ఈ నియమాలు పాటిస్తేనే ప్రయోజనం

Exit mobile version