Lord Shiva: సాధారణంగా మనకు ఏ ఆలయానికి వెళ్లిన శివుడు లింగరూపంలో మాత్రమే దర్శనమిస్తాడు. శివుడు విగ్రహ రూపంలో కాకుండా ఇలా లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తూ భక్తుల కోరికలను నెరవేర్చే ఇస్తూ ఉంటారు.అయితే మనం ఏ ఆలయంలోనైనా ఒకసారి విగ్రహాన్ని లేదా లింగాన్ని ప్రతిష్టించిన అప్పుడు అది ఎన్ని సంవత్సరాలైనా అదే పరిమాణంలో ఉంటుంది. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం పెరుగుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
పూర్వం ఒరిస్సాకు చెందిన రాజులు కూడా స్వామివారి ఆలయాన్ని నిర్మించాలని భావించారు. అయితే ప్రతి ఏటా స్వామి వారి లింగం పెరగటం వల్ల ఆలయం నిర్మించడానికి సాధ్యపడలేదు. ఇక ఈ స్వామివారిని తాకి వచ్చే గాలిని పీల్చడం వల్ల ఎలాంటి రోగాలు ఉండవని అక్కడి ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు. ఇక ఈ గ్రామంలో ఎక్కువమంది స్వామివారి పేర్లు పెట్టుకుంటారు. సంతానం లేని వారు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకోవడం వల్ల సంతానం కలుగుతుందని భావిస్తారు. ఇక మాఘమాసం, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్న స్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
