Wallet Vastu: సాధారణంగా కొన్ని వస్తువులు వాస్తు పరంగా మనకు ఎంతో మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి.అందుకే ఈ విధమైనటువంటి అదృష్టాన్ని కలిగించే వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం చేస్తుంటాము.అయితే అలాంటి అదృష్టం కలిగించే వస్తువులు పాడైపోతే వాటిని బయట పడేయాలంటే చాలామందికి మనసు ఒప్పుకోదు.ముఖ్యంగా కొందరికి వారి పర్సులో డబ్బులు పెట్టుకున్నప్పుడు ఎంతో అదృష్టం కలిసివస్తుందని ఆ పర్స్ లో డబ్బులు పెట్టడం వల్ల వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భావిస్తుంటారు. అయితే ఆ ఫర్స్ పాడైపోతే ఆ ఫర్స్ పడేసేముందు ఎంతో బాధపడుతూ ఉంటారు.
ఇకపోతే చాలామంది ఇలా పాత పర్స్ పడేయడానికి మనసు ఒప్పుకోకపోతే వాటిని వారి దగ్గరే ఉంచుకోవచ్చు. అయితే ఖాళీగా ఉండకుండా కొన్ని బియ్యపు గింజలు,లేదా రూపాయి నాణెం వేసి వాటిని భద్రపరచుకోవాలి. అప్పుడే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.లేదంటే చిరిగిపోయిన వాలెట్ అలాగే పెట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.