Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పురాతన కాలంలో మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అరిటాకులో భోజనం పెట్టే వాళ్ళు. అలాగే ఏదైనా పూజా కార్యక్రమాలు, శుభ కార్యాలలో కూడా అతిథులకు బంధువులకు అరిటాకు భోజనం పెట్టి పంపించేవారు. కాలం మారుతున్న కొద్దీ అరిటాకులు కూడా మరుగున పడిపోయాయి. అయితే కొన్నిచోట్ల ఇప్పటికీ ఇదే ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. అరిటాకులో భోజనం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మనకు తెలిసిందే.ఇక మనకు ఎవరైనా విష ప్రయోగం చేస్తున్నారనే విషయాన్ని అరిటాకు ఎంతో సులభంగా గుర్తిస్తుంది.
అరిటాకులో ముందుగా కుడివైపు పాయసం వడ్డించాలి. కుడి వైపు నుంచి వరుసగా పప్పు, పచ్చడి, రసం, చివరిగా పెరుగు వడ్డించాలి. ఇక అరటాకు మధ్యలో అన్నం వడ్డించుకుని తినాలి. ఈ విధంగా అరిటాకులో భోజనం చేసేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇకపోతే అరిటాకులో భోజనాన్ని అమావాస్య, పౌర్ణమి వంటి రోజులలో చేయకూడదని పండితులు చెబుతున్నారు.