Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Chanakya Niti : ఇలాంటి తప్పులు చేస్తే.. జీవితంలో అసలే ఎదగలేరంట..!

Chanakya Niti : ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనేక తప్పులు చేస్తుంటారు. కొన్ని తెలిసి తప్పులు చేస్తారు. మరొకొన్ని తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. అయితే ఏయే తప్పులు అనేది గుర్తించడం కూడా కష్టమే.. అందుకే గురువులకే గురువైన చాణిక్యుడు చెప్పే నీతిసూక్తులను తప్పక తెలుసుకోవాల్సిందే.. చాణిక్య చెప్పే నీతి సూక్తులు మన నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. చాణిక్య చెప్పిన సూక్తులను పాటిస్తూ తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తారనడంలో సందేహం అక్కర్లేదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయం సాధించాలని కోరుకోవడం సహజమే. కొన్నిసార్లు తెలియకుండానే చేసిన తప్పులు అపజయానికి దారి తీస్తాయి.

Chanakya Niti : Follow These 5 Things to Attain Success in Life

ఈ తప్పులు మనిషి శ్రమను కూడా వృథా చేస్తాయని చాణిక్య నీతిలో చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితులలో ఈ తప్పులు అసలే చేయొద్దని ఆచార్య చాణిక్య తెలిపారు. ఎప్పుడూ కూడా ఒకరిని ఇమేటెడ్ చేయకూడదు. అచ్చం వారిలానే ప్రవర్తించరాదు. మీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలి. వేరొకరిని అనుసరిస్తూ ఏ పని చేయరాదు. మీ అర్హతలు మీకు ఏది సరైనది? ఫలితం ఏమిటో తెలుసుకోవడం ద్వారా నిర్ణయాలు తీసుకోండి. పనిలో విజయం సాధించగలరా లేదా అని ఒకటి రెండు సార్లు మిమ్మిల్ని మీరే ప్రశ్నించుకోండి. మీకు సమాధానం కచ్చితంగా వస్తే.. ఒక ప్రణాళికను రూపొందించుకోండి. ఆ తర్వాత ఆ పని ప్రారంభించండి.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

Chanakya Niti : జీవితంలో సక్సెస్ రావాలంటే.. చాణిక్యుడి చెప్పింది వినాల్సిందే..!

ప్రణాళికలు లేకుండా చేసే పని వైఫల్యానికి దారి తీస్తుందని గుర్తించుకోండి. మరోకొటి.. ఎక్కడ ఓడిపోతామనే భయం.. ఇది మనిషి ఎప్పటికీ ఎదగనీయదు.. ఇలాంటి భయం ఉన్నవారు జీవితంలో విజయం సాధించలేరు. ఏదైనా పని ప్రారంభించినప్పుడు. అది ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని అనవసరంగా  భయపడుతుంటారు. అతిగా అదే ఆలోచనతో ఆందోళన చెందుతుంటారు. అదే ఆలోచన మనసులోకి వస్తే.. వెంటనే ఆ పని అర్థవంతంగా ముగిస్తారు. అలాంటి పరిస్థితులలో వైఫల్యం ఎదురవుతుంది. పనిని మధ్యలోనే వదిలివేయ కూడదు. పనిని అసంపూర్తిగా వదిలివేయడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు.

Advertisement

మీరు ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు.. అసంపూర్తిగా వదిలివేయవద్దు. ఒక్కోసారి చాలామంది ఎంత కష్టపడినా చూడకుండానే మనసు మార్చుకుంటారు. ఇలా చేయవద్దు. పొరపాటు జరిగితే వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలి. మీరు ఎప్పటికీ లేకపోతే విజయం సాధించలేరు. మీరు చేయబోయే పనులను కూడా ఎప్పుడూ వాయిదా వేయరాదు. మరొకరికి ఈ ప్రణాళికలను చెప్పరాదు. ఇలా చెబితే మీ ప్రణాళికలను వాళ్లు అమలు చేసి సక్సెస్ సాధించే అవకాశం ఉంది. మీ విజయాన్ని వాళ్లు అందుకుంటారని మరిచిపోవద్దు. కొన్ని విషయాలు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. ఆ విజయం సాధించేవరకు మీ ఆలోచనలను ఎవరికి చెప్పకండి. లేకపోతే శత్రువులు మీకు సమస్యలను సృష్టిస్తారు.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Read Also : Chanakya Niti : ఇంట్లో ఈ సంకేతాలు కనపడుతున్నాయా? అయితే మీకు బ్యాడ్ టైం ప్రారంభమైనట్లే?

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version